హాట్: సూపర్ స్టార్స్ ఇద్దరూ చీరలు కట్టి డాన్స్
బాలీవుడ్ సూపర్ స్టార్స్ షారుఖ్‌ఖాన్, రణబీర్ కపూర్‌లు ఐటమ్ భామలకు ఏమాత్రం తీసిపోరని విధంగా చీరలు కట్టి డాన్స్ చేసారు. 'చిక్నీ ఛమేలీ', 'ఊలాలా ఊలాలా...' అంటూ ఆ ఇద్దరూ ఇటీవల ఫిల్మ్‌ఫేర్ వేదికపై డాన్స్ చేసిన వీడియోలు ఇప్పుడు హాట్ గా మారిపోయాయి. వారితో మాధురీదీక్షిత్ కూడా కలిసి చిందేశారు. 57 వ ఐడియా ఫిల్మ్ ఫేర్ అవార్డు ఫంక్షన్ లో ఇది ఒక ప్రత్యేక ఆకర్షణగా మారింది. అంతా నువ్వులు కురింపించిన ఈ డాన్స్ కు ప్రత్యేక అప్లాజ్ వచ్చింది.
ఇక షారూఖ్ వంటి సూపర్ స్టార్ ఇలా చేయటం చాలా మందిని ఆశ్చర్యంలో ముంచేసింది. అంతేగాక చాలా గ్యాప్ తర్వాత మాధురీ దీక్షిత్ లైవ్ లో డాన్స్ చేయటం అభిమానులను అలరించింది. ఇక షారూఖ్ ఖాన్ ప్రస్తుతం డాన్ సీక్వెల్ చేసి మంచి కలెక్షన్స్ రప్పించుకుని హ్యాపీ మూడ్ లో ఉన్నారు. దాన్నే స్టేజీపై ప్రతిఫలించాడని ముంబై మీడియా అంటోంది. మరో ప్రక్క రణబీర్ కపూర్ ని తెలుగు బిజినెస్ మెన్ రీమేక్ లో ఒప్పించాలని వర్మ విశ్వప్రయత్నం చేస్తున్నారు. అవసరమైతే కావాల్సిన మార్పులు చేసి తెరకెక్కిస్తామని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











