»   » హగ్ : కలవరు అనుకున్న హీరోలు కలిసారు!

హగ్ : కలవరు అనుకున్న హీరోలు కలిసారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ మధ్య గత కొంత కాలంగా కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య గత కొంతకాలంగా అసలు మాటలే లేవు. ఈ పరిస్థితి నెలకొనడానికి కారణాలు అనేకం. అయితే ఆశ్చర్య కరంగా ఇద్దరూ కలిసారు. హగ్ ఇచ్చుకున్నారు. గురువారం రాత్రి ముంబైలో జరిగిన 9వ రెనాల్డ్ స్టార్ గైడ్ అవార్డ్ కార్యక్రమం ఇందుకు వేదికైంది.

Shah Rukh and Salman

రెనాల్డ్ స్టార్ గైడ్ అవార్డ్ కార్యక్రమానికి సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ అవార్డు కార్యక్రమంలో షారుక్ ఖాన్ 2013 సంవత్సరానికిగాను ఎంటర్టెనర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా అవార్డు తీసుకోవడానికి వేదికపైకి వచ్చిన సందర్భంగా సల్మాన్, షారుక్ ఆలింగనం చేసుకున్నారు.

అవార్డు అందుకున్న సందర్భంగా షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ...'సల్మాన్ లాంటి గ్రేట్ ఎంటర్టెనర్ చూస్తుండగా ఈ అవార్డు అందుకోవడం ఎంతో స్పెషల్‌గా ఫీలవుతున్నాను' అన్నారు. అంతకు ముందు అవార్డు అందుకోవడానికి షారుక్ స్టేజీ మీదకు రాగనే....సల్మాన్ ఖాన్ 'హాయ్ షారుక్' అంటూ పలకరించారు. 2013 సంవత్సరంలో 'చెన్నై ఎక్స్‌ప్రెస్' బిగ్గెస్ట్ హిట్ అయినందుకు‌గాను షారుక్‌ను అభినందించాడు.

గతంలో 2008లో కత్రినా కైఫ్ బర్త్‌డే పార్టీ సందర్భంగా జరిగిన గొడవ తర్వాత మళ్లీ ఇద్దరూ కలుసుకోలేదు. ఆ మధ్య పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఎంఎల్ఏ బాబా సిద్ధిఖీ ముంబైలో ఏర్పాటు చేసిన విందులో కలుసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఇద్దరూ ఈ అవార్డు ఫంక్షన్లో కలుసుకున్నారు.

English summary
Bollywood's warring Khans Shah Rukh and Salman put up a united front by hugging each other at an awards night, where the 'badshah' received the Entertainer of The Year honour. The picture-perfect moment was captured at the 9th Renault Star Guild Awards here Thursday night.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu