చిరంజీవి పాత్రలో షారూఖ్ ఖాన్ ఖరారు
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఠాగూర్'తెలుగులో ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఈ చిత్రాన్ని ఇప్పుడు షారూఖ్ ఖాన్ తో చేయటానికి రంగం సిద్దమైంది.'ఠాగూర్'ఒరిజనల్ 'రమణ' హిందీ రీమేక్ హక్కుల్ని ప్రముఖ దర్సకుడు సంజయ్‌లీలా భన్సాలీ దక్కించుకొన్నారు. షారుఖ్‌ఖాన్ హీరోగా ఒప్పించారు. మాతృకను రూపొందించిన ఎ.ఆర్.మురుగదాస్‌కే దర్శకత్వ బాధ్యతలు అప్పగిస్తున్నారు. అన్నా హజారే అవినీతిపై పోరు సాగిస్తున్న తరుణంలో ఈ కథ అందరికీ నచ్చుతుందని భన్సాలీ భావిస్తున్నారు. యువతనీ, ఉత్తరాది ప్రేక్షకుల్నీ మెప్పించేలా కథలో మార్పులు చేసినట్లు బాలీవుడ్ సమాచారం.
ఇక ఇప్పటికే సంజయ్ లీలా భన్సాలీ తెలుగులో సూపర్ హిట్టైన విక్రమార్కుడు చిత్రం రీమేక్ ని అక్షయ్ కుమార్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రభుదేవా డైరక్ట్ చేస్తున్నారు. రౌడీ రాధోడ్ టైటిల్ తో రూపొందే ఈ చిత్రం మార్కెట్లో మంచి క్రేజ్ సంపాదించుకుని బిజినెస్ బాగా జరుగుతూండటంతో సంజయ్ లీలా భన్సాలీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇప్పటికే మురగదాస్ గజనీతో బాలీవుడ్ లో ఓ రేంజి రికార్డులు క్రియేట్ చేసి ఉన్నాడు. దాంతో 'ఠాగూర్'రీమేక్ తో మళ్లీ గజనీ మ్యాజిక్ ని రిపీట్ చేయవచ్చని భావిస్తున్నాడు. ఇప్పటికే హిందీకి తగ్గట్లు ఈ స్క్రిప్టులో మార్పులు చేసినట్లు చెప్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ కు వెళ్లనుంది. షారూఖ్ సైతం డాన్ 2 వంటి చిత్రంతో నెగిటివ్ పాత్ర చేసి ఉండటంతో సమాజానికి సందేశాన్నిచ్చే చిత్రంలో చేసి ఆ ఇమేజ్ నుంచి బయిటకు రావాలని చూస్తున్నారు.


Click it and Unblock the Notifications











