విడుదలకు సిద్ధమైన "శృంగారం" (హాట్ ఫోటోస్)
హైదరాబాద్: "శృంగారం" అనేది ఎప్పటికీ ఆసక్తికర అంశమే. ఇక కొన్ని సినిమాలకు "శృంగారం" అనే అంశమే ఆయువు పట్టు. ఒక వర్గం ప్రేక్షకులను, యువతను ఆకట్టుకోవడానికి కొందరు ఫిల్మ్ మేకర్స్ తమ సినిమాల్లో శృంగార సన్నివేశాలు జొప్పించడం ఇపుడు సర్వ సాధారణమే అయింది. ఇందుకు పెద్ద హీరోల సినిమాలు కూడా మినహాయింపు కాదు.
మరి అలాంటి "శృంగారం" అనే పదాన్నే టైటిల్ పెట్టుకుని ఓ చిత్రం వస్తోంది. ఆదర్శ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శక నిర్మాణ భాద్యతలు చేపడుతున్నారు. ఇందులో ఖుషి ముఖర్జీ హీరోయిన్ గా నటిస్తుంది. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చితాన్ని హిందీలో "శృంగార్" గా విడుదలవుతుంది.
స్లైడ్ షోలో సినిమా విడుదల విశేషాలు, ఫోటోలు...

కథేంటి?
ఇది విక్రమాదిత్య అనే రాజు కధ, కేవలం శృంగారం మీద మాత్రమే ఆసక్తితో రాజ్యంలో ప్రజలని పట్టించుకోకుండా ఉండే రాజు కధ.

కాన్సెప్టు ఏంటి?
రాజ్యంలో ప్రజలని పట్టించుకోకుండా ఉండే రాజు తరువాత ఒక ఋషి కారణంగా తను చేసే తప్పేంటో తెలుసుకుంటాడు, తర్వాత ఏమి జరిగింది అన్నది మిగిలిన కథ.

రొమాంటిక్ ఎంటర్టెనర్
నిర్మాత మాట్లాడుతూ...మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నామని తెలిపారు.

విడుదల ఎప్పుడు?
జనవరి 31 న విడుదల అవుతున్న ఈ చిత్రాన్ని 4 ఎస్ బ్యానర్ ఆంధ్రప్రదేశ్ లో విడుదల చేస్తుంది.


Click it and Unblock the Notifications