‘సెక్సిజమ్‌’.... నిర్మాతలను చెప్పుతో కొడతానన్న హీరోయిన్ శృతి!

By Bojja Kumar

Recommended Video

‘సెక్సిజమ్‌’.. నిర్మాతలను చెప్పుతో కొడతానన్న హీరోయిన్ శృతి !

పార్క్‌ హాయత్‌ హోటల్‌లో జరిగిన ఇండియా టుడే సౌత్‌ కన్‌క్లెవ్‌-2018లో భాగంగా 'సెక్సిజం ఇన్‌ సినిమా' అంశంలో జరిగిన చర్చలో శృతి హరిహరన్, ప్రణిత, బినా పౌల్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు ఇండస్ట్రీలో తమకు ఎదురైన సంఘటనలు వెల్లడించారు.

లైంగికంగా వేధింపులు

లైంగికంగా వేధింపులు

నేను చేసిన ఓ కన్నడ సినిమా తమిళంలో రీమేక్ చేయడానికి ప్లాన్ చేశారు. కన్నడలో చేసిన పాత్రనే తమిళంలో ఇచ్చారు. అయితే తమిళ హక్కులు కొన్ని నిర్మాతలు తనను లైంగికంగా వేధించారని శృతి హరిహరన్ తెలిపారు.

చెప్పుతో కొడతానన్నా

చెప్పుతో కొడతానన్నా

ఐదుగురు నిర్మాతల్లో ఒకరు నా వద్దకు వచ్చి ‘మేము ఐదుగురం నిర్మాతలం. మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నిన్ను ఎక్స్‌ఛేంజ్‌ చేసుకుంటాం.' అని చెప్పడంతో నా చెప్పుచూపించి వెళ్లి వచ్చానని శృతి హరిహరన్ తెలిపారు.

చెప్పు చూపించడంతో అవకాశాలు తగ్గాయి

చెప్పు చూపించడంతో అవకాశాలు తగ్గాయి

తన పట్ల అలా ప్రవర్తించిన నిర్మాతలకు చెప్పు చూపించడం తన కెరీర్ మీద ఎఫెక్ట్ చూపిందని, ఈ సంఘటన తర్వాత తమిళ్‌లో తనకు అవకాశాలు తగ్గిపోయాయని శృతి తెలిపారు.

నా గురించి దుష్ప్రచారం చేశారు

నా గురించి దుష్ప్రచారం చేశారు

నేను వారి కోరిక తీర్చలేదనే కోపంతో నాపై దుష్ప్రచారం చేశారు. నాకు అవకాశాలు రాకుండా చేశారు అని శృతి తెలిపారు. తొలినాళ్లలో ఓ కన్నడ సినిమా సమయంలో కూడా ఇలాంటి అనుభవమే ఎదురైనట్లు ఆమె చెప్పారు.

చాలా నీచంగా చూస్తారు

చాలా నీచంగా చూస్తారు

హీరోయిన్ ప్రణిత మాట్లాడుతూ.... బయట జనాలు హీరోయిన్‌ అంటే గొప్ప అనుకుంటారు, కాని చిత్ర పరిశ్రమలో అలా చూడరు. నిర్ణయాల్లో చివరి కేటగిరిలోనే హీరోయిన్‌ ఉంటుందన్నారు. కొందరైతే మరీ నీచంగా చూస్తారు అని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X