»   »  న్యూడ్ ఫోటోలు: పోలీసులకు ఫిర్యాదు చేసిన హీరోయిన్!

న్యూడ్ ఫోటోలు: పోలీసులకు ఫిర్యాదు చేసిన హీరోయిన్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగుళూరు: సినీ స్టార్లు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా కారణంగా రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆకతాయిలు కొందరు హీరోయిన్ల ఫోటోలను న్యూడ్ గా మార్ఫింగ్ చేసి ఆ ఫోటోలు వారినే అనే విధంగా ఫేస్ బుక్, వాట్సాప్ లాంటి వాటిలో వైరల్ చేస్తున్నారు.

తాజాగా ఇలాంటి న్యూడ్ ఫేక్ ఫోటోల వ్యవహారంలో బాధితురాలిగా మారింది శాండల్‌వుడ్ హీరోయిన్ శృతి హరిహరన్. ఆమెకు సంబంధించిన కొన్ని నగ్న ఫోటోలు ఫేస్ బుక్, వాట్సాప్ కనిపించడంతో వాటిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసారు.

అసభ్యమైన ఫోటోలు

అసభ్యమైన ఫోటోలు

శృతి హారిహరన్ ముఖంతో మార్పింగ్ చేసిన అసభ్యమైన ఫోటోలు ఫేస్ బుక్, వాట్సాప్ వైరల్ అవుతుండటంతో వెంటనే ఆమె బెంగుళూరు పోలీస్ కమీషనర్ ను కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

ఫేక్ అకౌంట్

ఫేక్ అకౌంట్

ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఈ న్యూడ్ ఫోటోలను వైరల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీని వెనక ఎవరు ఉన్నారు? అనే విషయమై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

కేసు నమోదు

కేసు నమోదు

శృతి హరిహరన్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఇన్ఫర్మేషన్ యాక్ట్, 2000, సెక్షన్ 57 కింద కేసు నమెదు చేసి విచారణ ప్రారంభించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని డిసిపి(క్రైమ) ఆనంద్ కుమార్ తెలిపారు.

శృతి హరిహరన్

శృతి హరిహరన్

శృతి హరిహరన్ 2012లో మళయాలం చిత్రం ‘సినిమా కంపెనీ' ద్వారా తెరంగ్రేటం చేసారు. అనతి కాలంలోనే మళయాలం, కన్నడ చిత్ర సీమల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

English summary
Sandalwood actress Sruthi Hariharan is the latest victim of the cyber crime targeting celebrities. Recently, fake nude photos of Sruthi were posted on the social media platform like Facebook that quickly went viral. The 28-year-old South Indian star has filed a complaint with the cyber crime police at the police commissioner’s office on Infantry Road.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu