అర్జున్‌పై లైంగిక వేధింపుల కేసు: హీరోయిన్ శృతి హరిహరన్ రహస్యం బట్టబయలు!
పోలీస్ కంప్లయింట్ ఇచ్చి #మీటూ ఉద్యమంలో సంచలనం క్రియేట్ చేసిన కన్నడ హీరోయిన్ శృతి హరిహరన్ గురించిన ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఇంతకాలం తన జీవితానికి సంబంధించి అత్యంత రహస్యంగా ఉంచిన ఓ విషయం ఈ కేసు మూలంగా బట్టబయలైంది.
సీనియర్ నటుడు అర్జున్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన హీరోయిన్ శృతి హరహరన్ ఆయనపై బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫిర్యాదు కాపీలో రామ్ కుమార్ అనే పేరు కనిపించడం అందరినీ ఆశ్చర్య పరిచింది.
Recommended Video


రహస్యం బట్టబయలు
హీరోయిన్ శృతి హరిహరన్ ఇంతకాలం తనకు పెళ్లయిన విషయాన్ని రహస్యంగానే ఉంచింది. పెళ్లయినట్లు బయటకు తెలిస్తే సినిమా అవకాశాలు రావనే ఉద్దేశ్యంతోనే ఆమె ఈ విషయాన్ని రహస్యంగా ఉంచినట్లు సమాచారం. అయితే అర్జున్ మీద లైంగిక వేధింపుల కేసు పెట్టే సమయంలో ఆమె తనకు పెళ్లయిన విషయం బయటకు వెల్లడించక తప్పలేదు.

అలా భర్త పేరు బయటకు
శృతి హరిహరన్ ఇచ్చిన ఫిర్యాదులో తనకు 29 సంవత్సరాలు అని, తనకు పెళ్లయిందని వెల్లడించారు. అయితే పోలీసులు భర్త పేరు కూడా రాయాలని చెప్పడంతో ఆమె తన పేరు పక్కనే వైఫ్ ఆఫ్ రామ్ కుమార్ అని పేర్కొన్నారు.

ఇంతకాలం స్నేహితుడిగా
రామ్ కుమార్ ఇప్పటి వరకు శృతి హరిహరన్ స్నేహితుడిగా మాత్రమే తెలుసు. అయితే వీరికి పెళ్లయిన నిజం మొదట్టమొదటిసారి బయటకు వచ్చింది. అర్జున్ కేసు లేకుంటే ఈ విషయం ఎవరికీ తెలిసేది కాదు.

ఎవరీ రామ్ కుమార్
రామ్ కుమార్ ఒక నృత్యకారుడు. అతడి వద్ద డాన్స్ నేర్చుకోవడానికి వెళ్లిన సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది. ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుని, పెళ్లి చేసుకున్నామని శృతి హరిహరన్ పోలీసులకు వెల్లడించినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











