ఐరన్ లెగ్ అన్నారు పట్టించుకోలేదు

By Srikanya

హైదరాబాద్ : ''మొదట్లో నన్నందరూ ఐరెన్‌లెగ్‌ అన్నారు. కొన్ని విజయాలు సాధించగానే గోల్డెన్‌లెగ్‌ అని పిలిచారు. ఈ రెండింటినీ నేను పట్టించుకోలేదు. ఇమేజ్‌లు ఇక్కడ శాశ్వతం కాదు. అందుకే వాటి గురించి ఆలోచించకుండా నా పని నేను చేసుకొంటూ పోతున్నానంతే. పొగడ్తలు, విమర్శల లెక్కలేసుకొంటూ కూర్చుంటే ఒక్క అడుగూ వేయలేం'' అంటోంది శృతి హాసన్.

కెరీర్ ప్రారంభంలో శృతి నటించిన సినిమాలు ఏమీ ఆడలేదు. దాంతో అంతా ఆమెకు ఐరన్ లెగ్ అని పెట్టారు. అయితే గబ్బర్ సింగ్ సూపర్ హిట్ అవటంతో ఆమెకు మళ్లీ క్రేజ్ వచ్చింది. హీరోలు, దర్శకులు ఆమెని తమ సినిమాల్లో తీసుకోవటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. వీటి గురించి ఆమె ఇలా ప్రస్తావిస్తూ మాట్లాడింది.

Sruthi Hassan about her Image

అలాగే... ''ఒక్క సినిమాతోనే ఎవ్వరూ గొప్పవాళ్లు కాదు. కొన్ని విజయాలతో అంతా సాధించేసినట్టు కాదు. గెలిచిన రోజు అంతా బాగానే ఉంటుంది. ఒక్క ఫెయిల్టూర్ ఎదురైతే అంతా తారుమారే'' అంటోంది శ్రుతిహాసన్‌.

శ్రుతిహాసన్‌. సినిమాల విషయానికొస్తే ....రీసెంట్ గా 'ఆగడు'లో ప్రత్యేక గీతంలో కనిపించి కనువిందు చేసింది. ఇప్పుడు మహేష్‌బాబు సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. కమల్‌హాసన్‌ కూతురిగా కాదు శ్రుతిహాసన్‌గా తానేంటో నిరూపించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంటుందీ హీరోయిన్. అందులో విజయం సాధించింది కూడా. ఇప్పుడు ఆమెకు తెలుగు, తమిళంలో పెద్ద హీరోలు, బ్యానర్స్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఆమె డేట్స్ కోసం ఆగటానికి కూడా హీరోలు సిద్దపడుతున్నారు.

ప్రస్తుతం శ్రుతిహాసన్‌ తెలుగు, తమిళం, హిందీల్లో ఆరు సినిమాలతో బిజీగా ఉంది. హిందీ 'తేవర్‌'లో ఐటం సాంగ్ లో డాన్స్ చేసింది. ఆగడు చిత్రం రిజల్ట్ ఎలా ఉన్నా...శ్రుతి హాసన్ డాన్స్ కు మంచి పేరు వచ్చింది. కెరీర్ ప్రారంభంలో ఐరన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు గోల్డెన్ హ్యాండ్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X