మహేష్‌కి అభ్యంతరం లేకపోతే నాకూ లేదు
హైదరాబాద్:ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో డాన్స్ చేయటానికి శ్రుతిహాసన్ అయితే బాగుంటుంద నిపించింది. ఆమెను అడిగితే 'మహేష్‌కి అభ్యంతరం లేకపోతే నాకూ లేదు' అని చెప్పింది. అలాగే ఆమెకు భారీ పారితోషికం ఇచ్చామన్న మాటల్లో నిజం లేదు'' అని ఆగడు నిర్మాత రామ్ ఆచంట తెలిపారు. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మించిన చిత్రం 'ఆగడు'. మహేష్‌బాబు హీరో. తమన్నా హీరోయిన్. శ్రుతిహాసన్ ప్రత్యేక గీతంలో నర్తించింది. శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల మందుకు వస్తోంది.
అలాగే... ''ఆగడు'కీ మిగిలిన పోలీసు కథలకు ఎలాంటి సంబంధం లేదు. 'దూకుడు'కి సీక్వెల్ కాదు. ఇదో కొత్త కథ. 14 రీళ్ల పాటు వినోదం అందించడమే ధ్యేయంగా రూపొందించాం. మహేష్ అభిమానులకు పండగలా ఉంటుంది. శ్రీను వైట్ల చిత్రాన్ని చాలా స్త్టెలీష్‌గా తీర్చిదిద్దారు. సంభాషణలు అలరిస్తాయి. తమన్ సంగీతం ఆకట్టుకొంటోంది. సినిమా విడుదలయ్యాక పాటలకు మరింత జనాదరణ లభిస్తుందన్న నమ్మకం ఉంది. వరుసగా మహేష్‌తోనే సినిమాలు చేయడం ఓ రకంగా అదృష్టం. ఇక ముందూ ఈ అనుబంధం కొనసాగాలనుంద''ని అనిల్ సుంకర చెప్పారు.

ఇక చాలా క్లిష్టతరమైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపాం. ఆక్సిజన్ అందని చోట చిత్రీకరణ చేయాల్సి వచ్చింది. ఇలాంటి సందర్భంలో మహేష్ అందించిన సహకారం మర్చిపోలేం. 'మహేష్‌బాబు నిజంగానే పోలీస్ ఆఫీసర్ అయితే ఎలా ఉంటుందో అదే మా 'ఆగడు'. మహేష్‌లో హీరోయిజాన్ని కొత్త కోణంలో చూస్తారు అన్నారు.
''రికార్డుల కోసం ఆలోచించి సినిమా తీయలేదు. 'దూకుడు'ని మించిన విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. 'దూకుడు'లో రియాలిటీ షో నేపథ్యంలో వినోదం పండించాం. ఈ సినిమాలోనూ ఆ తరహా ఎపిసోడ్లున్నాయి. అవన్నీ కావల్సినంత వినోదం పంచుతాయి. విదేశాల్లో ఇంగ్లిష్ సబ్ టైటిల్స్‌తో ఈ సినిమాను విడుదల చేస్తున్నామ'' అని గోపీ ఆచంట తెలిపారు. చిత్రానికి కోటి పరుచూరి ఎగ్జిక్యూటివ్ నిర్మాత. చిత్రంలో రాజేంద్రప్రసాద్, నాజర్, తనికెళ్లభరణి, సోనూసూద్, ఆశీష్ విద్యార్థి, ఎం.ఎస్.నారాయణ, బ్రహ్మాజీ, అజయ్, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు.


Click it and Unblock the Notifications











