అమ్మతో పెళ్లి.. రాజమౌళిని ముందే తండ్రిగా ఫిక్స్ అయ్యా.. ఎందుకంటే: కార్తికేయ
దర్శకధీరుడు రాజమౌళి డైరెక్టర్ గా ఎంత పాపులర్ అయ్యాడో అందరికి తెలిసిందే. ఇండియా నుంచి మొదటి ఆస్కార్ అవార్డు గెలుచుకున్న చిత్ర దర్శకుడిగా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తన బ్రాండ్ వేల్యూ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. కొడుకు టాలెంట్ ని అందరికి పరిచయం చేసి అతన్ని గొప్పవాడిగా తీర్చి దిద్దాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు. అయితే రాజమౌళి విషయం అది విరుద్ధంగా ఉంటుంది. తండ్రి టాలెంట్, గౌరవాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లదానికి అతని తనయుడు కార్తికేయ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక రాజమౌళికి కార్తికేయ స్టెప్ సన్ అని అందరికి తెలిసిందే. అయితే ఇటీవల కార్తికేయ తన తల్లిని రాజమౌళి పెళ్లి చేసుకోక ముందు వారి బంధం ఎలా ఉండేదో చెప్పాడు. ఆ వివరాల్లోకి వెళితే..
కార్తికేయ కృషి:RRR సినిమాకి ఈ రోజు అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు, రివార్డులు, గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ లాంటివి దక్కాయి అంటే కచ్చితంగా అందులో కార్తికేయ కృషి చాలా ఉందని చెప్పాలి. రాజమౌళిని ఇప్పుడు ప్రపంచం మొత్తం కొనియాడుతూ ఉంది అంటే దాని వెనుక కార్తికేయ కష్టం ఉంది. అతని మార్కెటింగ్ ప్రమోషన్స్, రాజమౌళిని ఆకాశం అంత ఎత్తులో నిలబెట్టింది. అందుకే కీరవాణి ఆస్కార్ వేదికపైనే కార్తికేయకి థాంక్స్ చెప్పారు.

ప్రమోషన్స్ కోసం 80 కోట్లు:అంత చేసిన కూడా రాజమౌళి కొడుకుగానే కార్తికేయ తనని తాను పరిచయం చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉండటం విశేషం. ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ ప్రమోషన్స్ తో కార్తికేయ టాలెంట్ అందరికి తెలిసింది. ఈ సందర్భంగా మీడియా చానల్స్ కార్తికేయతో ప్రత్యేకంగా ఇంటరాక్ట్ అవుతున్నారు. ఆస్కార్ ప్రమోషన్స్, రాజమౌళితో అనుబంధంపై అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆస్కార్ ప్రమోషన్స్ కోసం 80 కోట్లు ఖర్చు చేసినట్లు జరుగుతున్న ప్రచారానికి కార్తికేయ ఇప్పటికే ఫుల్ స్టాప్ పెట్టారు.
ఎనిమిదేళ్ళ వయస్సు ఉన్నప్పుడే:8 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యాయని లెక్కలతో సహా పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ ఆస్కార్ ప్రమోషన్ అంశాలతో పాటు రాజమౌళితో తనకున్న అనుబంధం గురించి పంచుకున్నారు. తనకి ఎనిమిదేళ్ళ వయస్సు ఉన్నప్పుడే రాజమౌళి మా ఇంటికి వస్తూ ఉండేవారు. ఒక వేళ రాకపోతే తానే రమ్మని ఫోన్ చేసి అడిగేవాడిని, అప్పుడు సీరియల్ షూటింగ్స్ లో బిజీగా ఉండి రాలేకపోయేవారు.

అమ్మతో పెళ్లికి ముందు..:అప్పుడే రాజమౌళిలో నేను తండ్రిని చూసా. అమ్మని పెళ్లి చేసుకున్నప్పుడు నాకు ఆనందం వేసింది. నేను కోరుకున్నది అదే కదా అనిపించింది. పెళ్లి చేసుకుందామని చెప్పడానికి ముందే నేను రాజమౌళిని తండ్రిగా ఫిక్స్ అయిపోయా. అయితే తనని నాన్న అని పిలవడం కంటే బాబా అని పిలవడం అలవాటుగా మారిపోయింది. ఇప్పటికి అలాగే పిలుస్తాను. ఆ పిలుపులో మా ఇద్దరి మధ్య అనుబంధం ఎంత స్ట్రాంగ్ ఉందో చెప్పొచ్చు అని కార్తికేయ పేర్కొన్నారు.
SSMB 29 కోసం సిద్ధంగా..:ఇక రాజమౌళి తన తదుపరి సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది మొదలు కాబోతోంది. ఇక ఆ విషయం గురించి కార్తికేయ పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు కానీ తప్పకుండా సినిమా కూడా ఊహించిన స్థాయిలోనే ఉంటుంది అని వివరణ ఇచ్చాడు. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ తన 28వ సినిమాను పూర్తి చేయకముందే రాజమౌళి ప్రాజెక్టును కోసం ఈ సెప్టెంబర్ లో వర్క్ షాప్ మొదలుపెట్టబోతున్నాడు..


Click it and Unblock the Notifications











