నిర్మాతగా రాజమౌళి తనయుడు కార్తికేయ: తొలి ప్రాజెక్ట్ వివరాలు ఇవే...
టాలీవుడ్ టాప్ డైరెక్టర్, బాహుబలి లాంటి సెన్సేషనల్ సినిమాలను తెరకెక్కించిన రాజమౌళి ఫ్యామిలీలో నుంచి ఇప్పటి వరకు నిర్మాతలు లేరు. ఆ లోటును పూడుస్తూ ఆయన తనయుడు ఎస్ఎస్ కార్తికేయ సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు.
'షోయింగ్ బిజినెస్' పేరుతో సొంత బేనర్ స్థాపించిన కార్తికేయ... ఈ బేనర్లో తెరకెక్కించే తొలి చిత్రాన్ని ప్రకటించాడు. 'ఆకాశవాణి' పేరుతో తెరకెక్కే ఈ చిత్రం ద్వారా కొత్త దర్శకుడు అశ్విన్ గంగరాజు పరిచయం కాబోతున్నాడు. ఇతడు ఇంతకు ముందు బాహుబలి డైరెక్షన్ టీమ్‌లో పని చేయడం గమనార్హం.

అంతా రాజమౌళి ప్లానింగేనా?
ఎస్ఎస్ కార్తికేయ సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టడం... తండ్రి రాజమౌళి ప్లానింగేనా? అంటే కాదు అని అంటున్నారు వారి సన్నిహితులు. ఇదంతా రాజమళి భార్య రమ ప్లానింగ్ అని తెలుస్తోంది.

సంగీత దర్శకుడిగా కాలభైరవ ఎంట్రీ
ఎం.ఎం.కీరవాణి తనయుడు, సింగర్ కాలభైరవ ఈ చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చూస్తుంటే... ఈ సినిమా ద్వారా రాజమౌళి ఫ్యామిలీలోని యువతరంగం టాలెంటును వెలికితీసే ప్రయత్నం జరుగుతున్నట్లు కనిపిస్తోంది.

సినీయర్ ప్రముఖుల సపోర్ట్
ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తుండగా, సురేశ్ రగుతు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఈ చిత్రానికి ఎడిటర్‌గా పని చేయబోతున్నారు.

సినిమా బ్యాక్ డ్రాప్ ఏమిటి?
రోటీన్ సినిమాలకు భిన్నంగా ‘ఆకాశవాణి' సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఇదొక పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కబోయే ఈ చిత్రం అని తెలుస్తోంది. ఇంకా నటీనటుల ఎంపిక జరుగలేదు. జనవరి నుంచి షూటింగ్ మొదలు పెడతారట.

తెర వెనక
సౌండ్ డిజైన్: రఘునాథ్.కె
కాస్ట్యూమ్స్: సంజనా శ్రీనివాస్
కాస్టింగ్ డైరెక్టర్: మహతి బిక్షు
ప్రొడక్షన్ డిజైనర్: మోహన్ నాథ్ ఎస్.బింగి
లైన్ ప్రొడ్యూసర్: శశాంక్
స్క్రీన్ ప్లే: అశ్విన్ గంగరాజు, సందీప్ రాజ్, సాయికుమార్ రెడ్డి
నిర్మాత: ఎస్.ఎస్.కార్తికేయ
దర్శకత్వం: అశ్విన్ గంగరాజు


Click it and Unblock the Notifications











