'దూకుడు' దూలవాగుడు అంటూ రాజమౌళి
ఈ మధ్య కాలంలో ప్రతీ విషయంలో తన స్పందనను తెలియచేస్తున్న ప్రముఖ దర్శకుడు రాజమౌళి తాజాగా దూకుడు చిత్రంపై ట్వీట్ చేసారు. మహేష్ హీరోగా వచ్చిన దూకుడు మొన్న శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రం గురించి రాజమౌళి ట్వీట్ చేస్తూ...దూకుడులో బెస్ట్ ధింగ్ ఏమిటంటే దూల వాగుడు క్యారెక్టర్.వైట్ల శ్రీను గారు మహేష్ కోసం ఈ పాత్రను బాగా క్రియేట్ చేసారు. మహేష్ ఆ పాత్రను చాలా ఈజ్ తో చేసారి.అదే ఈ సినిమా ఇంతలా సక్సెస్ లఅవటానికి కారణం. ఇక ఈ చిత్ర నిర్మాతలు కూడా ఎన్నో దియోటర్స్ లో విడుదల చేసారు. కంగ్రాట్స్ మహేష్, గోపీ గారు, రామ్ గార్, అనీల్ గారు అండ్ హోల్డ టీమ్ అన్నారు.ఇక శుక్రవారం విడుదలైన దూకుడు చిత్రంలో మహేష్ పోలీస్ అధికారిగా కనిపిస్తారు. అలాగే సమంత గ్లామర్ ఈ సినకు ప్లస్ అయ్యింది .ఎమ్ ఎస్ నారాయణ, బ్రహ్మానందం కామిడీకూడా ధియోటర్లలో నవ్వులు పండించి సినిమా రేంజిని పెంచుతున్నాయి. అన్ని చోట్ల నుంచి ఈ సినిమాకు పాజటివ్ రిపోర్టులు వస్తున్నాయి. పోకిరి అంత విజయం కాకపోయినా మంచి హిిట్ నే నమోదు చేస్తుందని చెప్తున్నారు. ఇక రాజమౌళి విషయానికి వస్తే ఆయన నాని,సమంత కాంబినేషన్ లో ఈగ అనే చిత్రం రూపొందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











