twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తుపాకీలు, అమ్మాయిలు, వినోదం: రాజమౌళి

    By Srikanya
    |

    SS Rajamouli
    హైదరాబాద్ : రిలీవజయ్యే సినిమాలపై ఎప్పటికప్పుడు స్పందించే రాజమౌళి ...ఈ సారి 'ధూమ్‌ 3'...చూసి తన అభిప్రాయం ట్విట్టర్, ఫేస్ బుక్ లో తెలిపారు. ఈ సినిమా ఆంధ్ర, సీడెడ్ హక్కుల్ని 'ఈగ' నిర్మాత, రాజమౌళి సన్నిహితుడు...వారాహి చలనచిత్రం అధినేత కొర్రపాటి సాయి దక్కించుకున్నారు. ఈ సినిమా పంపిణీ హక్కులకు నెలకొన్న తీవ్ర పోటీలో ఆయన భారీ మొత్తం చెల్లించి ఆ హక్కులను చేజిక్కించుకున్నారు.

    ''తుపాకీలు, అమ్మాయిలు, వినోదం వీటితో పాటు అమీర్‌ఖాన్‌ కూడా తోడై.. 'ధూమ్‌ 3' సంపూర్ణ చిత్రమైంది. నాకీ సినిమా నచ్చింది'' అంటూ రాజమౌళి ఫేస్‌బుక్‌లో సందేశం పంపి ప్రమోట్ చేసారు. నందమూరి బాలకృష్ణ, ఎస్‌.ఎస్‌.రాజమౌళి, మోహన్‌బాబు, విష్ణుల కోసం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. సాయి ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను రూపొందిస్తున్న 'లెజెండ్' చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మిస్తున్నారు.

    తెలుగు సినీ పరిశ్రమ కూడా 'ధూమ్‌ 3'పై దృష్టిపెట్టింది. సినీ ప్రముఖులు తమ షూటింగులను, బిజీ షెడ్యూలునూ పక్కన పెట్టి మరీ 'ధూమ్‌ 3' సినిమా చూడడానికి ఆసక్తి చూపించారు. రకరకాల అభిప్రాయాలు ఈ చిత్రంపై వెల్లబుచ్చారు. ఈ చిత్రాన్ని ఈ శుక్రవారం సినీ అభిమానులంతా ఈ పేరే జపించారు. 'సినిమా ఎలా ఉంది? అమీర్‌ఖాన్‌ ఎంత మ్యాజిక్‌ చేశాడు..?' అనే విషయాలపై సగటు సినీ అబిమానులు ఆసక్తిగా చర్చించుకొన్నారు.

    ఇక అమీర్‌ఖాన్, కట్రీనా కైఫ్, అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రా ప్రధాన పాత్రలు పోషించిన 'ధూమ్ 3' చిత్రం ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల అయ్యింది. విజయ్‌కృష్ణ ఆచార్య దర్శకత్వంలో యశ్‌రాజ్ ఫిలిమ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ చిత్రం నైజాంలో యశ్‌రాజ్ ఫిలిమ్స్ సొంతంగా విడుదల చేయనున్నట్లు సమాచారం. కాగా 'ధూమ్ 3'లో అమీర్, కట్రీనాపై చిత్రీకరించిన ఓ పాటకు నిర్మాతలు రూ. 5 కోట్లు ఖర్చు చెయ్యడం గమనించదగ్గ అంశం.

    English summary
    Rajamouli write: On the face of it Dhoom3 is the same guns, girls and fun. But enter Aamir, and it transforms into a much more wholesome film. Loved it!! - SS Rajamouli
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X