రాజమౌళి బాగానే మోస్తున్నాడు

By Srikanya

హైదరాబాద్ : తనది కాని సినిమాలను ప్రమోట్ చేయటంలో రాజమౌళి ఎప్పుడూ ట్విట్టర్ తో ముందుంటారు. తాజాగా ఆయన తన మిత్రుడు, నిర్మాత సాయి కొర్రపాటి తాజా చిత్రం "ఊహలు గుసగుస లాడే" చిత్రంపై రోజుకో అప్ డేట్ పెడుతూ ఆ చిన్న సినిమాపై అందరి దృష్టీ పడేటట్లు చేస్తున్నారు. మొన్న శుక్రవారం విడుదలైన ఈ చిత్రం దర్శకుడుగా శ్రీనివాస అవసరాల కు మంచి మార్కులే వేయించింది. కానీ మల్టిఫ్లెక్స్ లు, ఎ సెంటర్లలకే పరిమితమయ్యేటట్లు కనపడుతోంది.

'అష్టాచమ్మా' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటుడు అవసరాల శ్రీనివాస్. ఆ తర్వాత అడపాదడపా సినిమాల్లో నటించారు. తాజాగా 'ఊహలు గుసగుసలాడే'తో దర్శకుడిగా అవతారమెత్తారు. నాగశౌర్య, రాశిఖన్నా జంటగా నటించిన ఈ సినిమాను వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించారు.

SS Rajamouli about "Oohalu GusaGusalaade"

దర్శకుడు మాట్లాడుతూ... "భారీ బడ్జెట్ సినిమాలు తీసి నిర్మాతలకు నష్టం చేకూర్చడం నాకిష్టం లేదు. నిర్మాత సేఫ్‌గా ఉండాలనే ఈ ప్రాజెక్ట్ చేశాను. నాకు నిర్మాతల శ్రేయస్సే ముఖ్యం. నేను నటనలో గానీ, డైరక్షన్‌లోగానీ ఇంకా సెటిల్ కాలేదు. ఇంద్రగంటి మోహనకృష్ణతో కలిసి ఓ స్టోరీ ప్రిపేర్ చేస్తున్నాను. హీరో ఎవరని ఇంకా అనుకోలేదు. నాగచైతన్యతో సినిమా చేస్తున్నాననే వార్తలో నిజం లేదు. చైతూకి సాయిగారు ఓ కథను చెప్పమన్నారు. నేను ఇంకా చెప్పలేదు. ప్రస్తుతం 'బందిపోటు'లో నటిస్తున్నాను. నా దృష్టిలో దర్శకత్వం కన్నా నటించడమే కష్టం. మరొకరి మనసులోని ఊహలకు అనుగుణంగా పాత్రలోకి ఒదగడమంటే మాటలు కాదు. '' అన్నారు.

చిత్రంలో కథమింటే
ఎన్. వెంకటేశ్వరరావు అలియాస్ వెంకి (నాగ శౌర్య)కి న్యూస్ రీడర్ కావాలనేది జీవితాశయం (అందుకో సెంటిమెంట్ ప్లాష్ బ్యాక్ ఉంటుందనుకోండి). తన లక్ష్యం కోసం ఓ ఛానెల్ లో పనిచేస్తున్న అతన్ని బాస్ ఉదయ్ భాస్కర్ (శ్రీనివాస్ అవసరాల) ఈ లక్ష్యం తెలుసుకుని,లైఫ్ ఇస్తానంటూ వాడేసుకుంటూంటాడు. అంతేకాక తనుపెళ్లి చూపుల్లో చూసిన అమ్మాయిని ఇంప్రెస్ చేయటానికి సలహాలు ఇచ్చి, పెళ్లి దాకా తీసుకువస్తే, న్యూస్ రీడర్ పోస్ట్ ఇస్తానని ఆశపెడతాడు. దాంతో బాస్ కి సాయపడదామని బయిలుదేరిన వెంకికి ఓ నిజం తెలుస్తుంది. అది...తను గతంలో ప్రేమించి,బ్రేక్ అప్ అయిన అమ్మాయి శిరీష (రాసి ఖన్నా) నే తన బాస్ ...ఇష్టపడుతున్నాడని....ఆ సమయంలో వెంకీ ఏం నిర్ణయం తీసుకున్నాడు. తన బాస్ కి సాయం చేసాడా...తను ప్రేమించుకున్న అమ్మాయిని దక్కించుకున్నాడా అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X