SS Rajamouli మహేష్‌తో సినిమాపై టొరెంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో రాజమౌళి.. SSMB29 స్టోరీ రివీల్ చేసిన జక్కన్న
బాహుబలి, RRR చిత్రాలతో ప్రపంచస్థాయి దర్శకుడిగా మారిన దర్శకధీరుడు SS రాజమౌళి ప్రస్తుతం టొరెంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రత్యేక ఆకర్షణగా మారారు. సెప్టెంబర్ 2022లో 11 రోజులపాటు సాగే 47వ టొరెంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రపంచస్థాయి అగ్రదర్శకులు, నటులు పాల్గొంటున్నారు. ఈ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో భాగంగా ప్రేక్షకులు, జర్నలిస్టులతో జరిగిన ముఖాముఖిలో మహేష్ బాబు సినిమాతోపాటు రాజమౌళి పలు విషయాలపై క్లారిటీ ఇచ్చారు. రాజమౌళి చెప్పిన విషయాల్లోకి వెళితే..

రాజమౌళి ఆటోగ్రాఫ్ కోసం
తాజాగా ఓటీటీలో రిలీజైన RRR మూవీ నేపథ్యంతో దర్శకుడు రాజమౌళి టొరెంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో అందర్నీ ఆకట్టుకొంటున్నారు. రాజమౌళితో సెల్ఫీలు దిగేందుకు, అలాగే ఆటోగ్రాఫ్‌ల కోసం విదేశీ అభిమానులు పోటెత్తారు. అభిమానులకు సంయమనంతో ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ రాజమౌళి కనిపించారు.

నా కెరీర్ ఇంకా ఆరంభంలోనే
టొరెంటోలో మీడియా కాన్ఫరెన్స్‌లో రాజమౌళి పాల్గొన్నారు. ఆయన వేదికపైకి రాగానే విదేశీ సినీ ప్రముఖులు, ప్రేక్షకులు కరతాళధ్వనులతో స్వాగతం పలికారు. ఈ వేదికపై పలువురు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెప్పారు. ఓ ప్రశ్నకు సమాధానం చెబుతూ.. ఇంకా నా కెరీర్ ఆరంభంలోనే ఉంది. నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది. సినిమా మేకింగ్‌లో బుడిబుడి అడుగులు వేస్తున్నాను అని రాజమౌళి చెప్పారు. రాజమౌళి వినయం, ఎదిగిన కొద్ది ఒదిగిన తీరు ప్రస్తుతం అందర్నీ ఆకట్టుకొంటున్నది.
యాక్షన్ సీన్లు, వీఎఫ్ఎక్స్ గురించి
టొరెంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో జరిగిన ముఖాముఖిలో రాజమౌళి మాట్లాడుతూ.. యాక్షన్ సీక్వెన్స్‌కు ఎమోషన్స్ చాలా ఇంపార్టెంట్. వీఎఫ్ఎక్స్‌తో ఎమోషన్స్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లవచ్చు అని ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు. హోస్ట్ జే హర్టాడో అడిగిన ప్రశ్నలకు రాజమౌళి చెప్పిన జవాబులు అందర్నీ ఆకట్టుకొన్నాయి.

మెల్ గిబ్సన్, బ్రేవ్ హార్ట్ గురించి
టోరెంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో హోస్ట్ జే హర్టాడో అడిగిన ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇస్తూ.. నాపై హాలీవుడ్ చిత్రాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నేను ఇష్టపడే నటుల్లో మెల్ గిబ్సన్ ఒకరు. అలాగే బ్రేవ్ హార్ట్ సినిమా భారీ ప్రభావం నాపై ఉంది అని చెప్పారు. రాజమౌళి చెప్పిన మాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన కనిపించింది.

ప్రపంచ సాహసయాత్రగా SSMB28
ఇక టొరెంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో మహేష్ బాబుతో తీయబోయే సినిమా గురించి రాజమౌళి ప్రస్తావించారు. RRR సినిమా తర్వాత నా తదుపరి సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉంటుంది. ప్రపంచ దేశాల్లో సాగే సాహసయాత్రగా సినిమా ఉంటుంది. globetrotting action adventure సినిమా అని రాజమౌళి ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్‌లో 29వ చిత్రంగా రూపొందనున్నది.

జపాన్‌లో RRR మూవీ రిలీజ్
ఇక రాజమౌళి విషయానికి వస్తే.. SSMB29 సినిమా స్క్రిప్టు పనులతోపాటు RRR సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. RRR సినిమాను జపాన్ దేశంలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను జపాన్ ప్రేక్షకుల ముందుకు త్వరలోనే తీసుకురానున్నారు. టొరెంటో ఫిల్మ్ ఫెస్టివల్ తర్వాత RRR ప్రమోషన్స్‌తో ముందుకు వెళ్తారు.


Click it and Unblock the Notifications











