సైరా చూసి సైసైరా అంటూ రాజమౌళి, శ్రీనువైట్ల, అనిల్ రావిపూడి ట్వీట్లు

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సైరా నర్సింహారెడ్డి చిత్రం ప్రేక్షకులతోపాటు సినీ ప్రముఖులు, దిగ్గజాల ప్రశంసలు అందుకొంటున్నది. రిలీజ్ తర్వాత తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి రిపోర్టును సొంతం చేసుకొంటున్నది. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున విడుదలైన ఈ చిత్రంపై పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో స్పందించారు. వారు ఏమని ట్వీట్ చేశారంటే. .

కంగ్రాట్స్ అంటూ శ్రీను వైట్ల

కంగ్రాట్స్ అంటూ శ్రీను వైట్ల

సినిమా పట్ల ఉన్న అంకితభావం, ప్రేమకు గాను మెగా పవర్ స్టార్ రాంచరణ్‌కు హార్టీ కంగ్రాట్స్. స్వాతంత్ర్య సమరయోధుడి కథను అద్భుతంగా తెరకెక్కించిన డైరెక్టర్ సురేందర్ రెడ్డికి ధన్యవాదాలు. అలాగే తారలు నయనతార, తమన్నా తమ పాత్రలతో వెండితెరపై మెరిసారు అని శ్రీను వైట్ల వెల్లడించారు.

సైరాకు బిగ్ సెల్యూట్

సైరాకు బిగ్ సెల్యూట్

సైరా నర్సింహారెడ్డిగా కొత్త అనుభూతిని పంచిన మెగాస్టార్ రాంచరణ్ బిగ్ సెల్యూట్‌. సైరాతో చరిత్రను సృష్టించారు. కథను అద్భుతంగా తెరకెక్కించిన డైరెక్టర్ సురేందర్ రెడ్డికి హ్యాట్సాఫ్. ఎక్ట్రార్డినరీ ప్రొడక్షన్‌ డిజైన్ చేసిన నిర్మాత రాంచరణ్‌కు ప్రత్యేకంగా అభినందనలు.

కాలగర్భంలో కలిసిన.. రాజమౌళి

కాలగర్భంలో కలిసిన.. రాజమౌళి

ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవితానికి చిరంజీవి గారు జీవం పోశారు. కాలగర్భంలో కలిసిపోయిన చరిత్రను మళ్లీ వెలుగులోకి తెచ్చాడు. జగపతిబాబు, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా తమ పాత్రలను అద్భుతంగా పోషించారు. సినిమాకు వీరంతా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు అని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఎమోషన్స్‌తో అంటూ సుధీర్ బాబు

ఎమోషన్స్‌తో అంటూ సుధీర్ బాబు

ఎమోషన్స్, అనుభవానికి సైరా నర్సింహారెడ్డి పెద్ద పీట వేశారు. మెగాస్టార్ ఫెర్ఫార్మెన్స్ లెజెండరీగా నిలిచింది. సురేందర్ రెడ్డి చరిత్రను వెండితెర మీద అద్భుతంగా ఆవిష్కరించారు. ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ ఎంత రిచ్‌గా ఉందో రాంచరణ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ అంతే రిచ్‌గా ఉన్నాయి అని సుధీర్ బాబు పేర్కొన్నారు.

 అనిల్ రావిపూడి ట్వీట్

అనిల్ రావిపూడి ట్వీట్

నర్సింహారెడ్డిగా తెర మీద మెగాస్టార్ గర్జించారు. ప్రాజెక్టును బలంగా నమ్మి.. అద్భుతంగా తెర మీద ఆవిష్కరించిన రాంచరణ్‌కు హాట్సాఫ్. సురేందర్ రెడ్డి టేకింగ్ సూపర్బ్. రత్నవేలు విజువల్స్ మైండ్ బ్లోయింగ్. తమన్నా అద్భుతంగా నటించింది అని అనిల్ రావిపుడి ట్వీట్‌లో పేర్కొన్నారు.

పరుచూరి గోపాలకృష్ణ ట్వీట్

పరుచూరి గోపాలకృష్ణ ట్వీట్

పద్నాలుగేళ్ల మా కలను సాకారం చేసిన మెగాస్టార్‌కు, ఆయన కడుపున పుట్టిన పులిబిడ్డ రామ్ చరణ్‌కి వందనం ! అభివందనం! నిద్రలేని రాత్రులు గడిపి, ఈ చిత్రం ఘన విజయం సాధించడానికి కారకుడైన సురేందర్‌రెడ్డికి, సాంకేతిక నిపుణులకు, నటీనటులకు నమో నమః జై చిరంజీవా, జైజై సైరా అని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు.

వరుణ్ తేజ్ ట్వీట్

వరుణ్ తేజ్ ట్వీట్

చిరంజీవి గారి ఫ్యాన్ అని చెప్పుకోవడానికి ఎప్పుడూ గర్వపడుతాను. సైరా నర్సింహారెడ్డి చూసి కొత్త అనుభూతికి గురయ్యాను. ఎమోషనల్‌గా, దేశభక్తితో కూడా ఈ చిత్రం ఎంతో స్ఫూర్తిని నింపింది. యాక్టర్లు, టెక్నిషియన్లు అద్భుతమైన ప్రతిభను చాటారు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి దండాలు. చరణ్ అన్నకు ప్రేమతో కూడా అభినందన అంటూ వరుణ్ తేజ్ ట్వీట్ చేశారు.

Recommended Video

Chiranjeevi Explained How Amitabh Bachchan Exempted Syeraa Offer
ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ కార్తీకేయ ట్వీట్

ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ కార్తీకేయ ట్వీట్

తెలుగు చరిత్రలో నర్సింహారెడ్డి, చిరంజీవి లాంటి ఇద్దరు యోధులకు సైరా చిత్రం గొప్ప నివాళి. దేవుడు ఎప్పటికి దేవుడే. నాకు దేవుడు దర్శనం లభించింది. మీకు లభించిందా? అద్భుతమైన సినిమాను అందించిన రాంచరణ్, సురేందర్ రెడ్డికి నా అభినందనలు అని హీరో కార్తీకేయ ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X