నాగార్జునని డైరక్ట్ చేయనున్న స్టార్ డైరక్టర్ రాజమౌళి
నాగార్జున గారు ఆ చిత్రంలో ఓ కీలకమైన మలుపు తెచ్చే గెస్ట్ పాత్ర చేయనున్నారు. దానికి నేను రెండు ఫైట్స్ ని కొరియోగ్రఫీ చేయటానికి ఒప్పుకున్నాను అంటున్నారు రాజమౌళి. ఆంటే పూర్తిగా నాగార్జున తో రాజమౌళి సినిమా చేస్తున్నారని కాదు. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ దర్సకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ వారు తెలంగాణ గ్రామం నేపధ్యంలో ఓ చిత్రం చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ పీరియడ్ కథలో నాగార్జున ఓ గెస్ట్ రోల్ చేయనున్నారు. దానికి రాజమౌళి సహకారం అందిస్తాడు. ఇక ఈ న్యూస్ బయిటకు రావటంతో రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ కోసం అనుకున్న తెలంగాణ కథ ఇదేనని వినపడుతోంది. ప్రభాస్ ఈ కథ వద్దనుకున్నాక వేరే వాళ్ళతో విజయేంద్రప్రసాదే ప్లాన్ చేస్తున్నారని చెప్తున్నారు. ఏదైతేనేం నాగార్జున...రాజమౌళి కాంబినేషన్ స్కీమ్ కొంతవరకూ వర్కవుట్ అవుతుంది. రాజమౌళి, నాగార్జున పేరు చెప్పి మార్కెట్ బాగానే అవుతుంది.


Click it and Unblock the Notifications











