శ్రీకృష్ణ కమిటీరిపోర్టు మ్యాటర్ పై రాజమౌళి రిక్వెస్ట్..
ఒకటి, రెండు రోజుల్లో శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు బహిర్గంతం కానున్న ఈ సమయంలో ఆంద్రప్రదేశ్ ప్రజలకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి ట్విట్టర్ ద్వారా రిక్వెస్ట్ చేసారు. రీపోర్టును మీరు స్వయంగా చదివే దాకా ఏ విధమైన కంక్లూజన్ కి రావద్దని అన్నారు. అలాగే మీడియాని ఉద్దేశిస్తూ...బాబ్రీ మసీద్ జడ్జిమెంట్ సమయంలో సంయమనం చూపి ఎలా గౌరవం పొందిందో అలాగే ఈ శ్రీకృష్ణ కమిటీ విషయంలోనూ మీడియా వ్యవహరిస్తుందని ఆశిస్తుందని అన్నారు. అలాగే దాదాపు ఆరువందల పేజీలు వరకూ ఉండే ఈ రిపోర్ట్ విషయంలో చదువుకున్న వారి గైడన్స్ ని నిరక్షరాస్యులు తీసుకుంటే బావుంటుందన్నట్లు సూచించారు. ప్రస్తుతం రాజమౌళి..ఈగ అనే చిత్రం రూపొందిస్తున్నారు. నాని, సమంత కాంబినేషన్ లో చేస్తున్న ఈ చిత్రంలో కన్నడ నటుడు సందీప్ విలన్ గా చేస్తున్నాడు.
రాజమౌళి ట్విట్టర్ బాబ్రీ మసీద్ ఈగ సునీల్ మర్యాద రామన్న rajamouli maryada ramanna sunil saloni magadheera eega


Click it and Unblock the Notifications