నా మనసుని కడుక్కున్నట్లే ఉంది: రాజమౌళి
'ఈ సినిమాని చూస్తే నా మనసుని కడుక్కున్నట్లే ఉంది' అన్నారు రాజమౌళి. ఇంతకంటే ఒక డైరెక్టర్‌కి ఏం కావాలి. రాజమౌళి ఈ సినిమాని రిసీవ్ చేసుకున్న విధానం మర్చిపోలేను అంటున్నారు 'వేదం' క్రిష్. తన చిత్రాన్ని మిగతా దర్శకులు మెచ్చుకున్న విధానాన్ని వివరిస్తూ...'వేదం' చూశాక ఒక డైరెక్టర్ అయితే 'చచ్చేలోగా ఇట్లాంటి ఒక సినిమా చేస్తా' అన్నాడు. 'కొత్త బంగారులోకం' డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల 'చచ్చేదాకా ఇట్లాంటి సినిమాలే చేద్దాం' అన్నాడు. రిలీజ్ కు రెండు రోజుల ముందు చూసిన రాఘవేంద్ర రావుగారు కొద్దిసేపు దాకా మాట్లాడలేకపొయ్యారు. అంతగా 'వేదం' ఆయన్ని కదిలించింది. ఆ తర్వాత ఫోన్ చేసి దాదాపు పావు గంటసేపు విశ్లేషణాత్మకంగా మాట్లాడారు. ఎవరూ ఈ సినిమాని డిస్ మిస్ చెయ్యలేరు. తెలుగు సినిమాల్లో ఇదో ఇంపార్టెంట్ ఫిల్మ్ అంటున్నారు క్రిష్.


Click it and Unblock the Notifications











