SSMB29: రాజమౌళిపై మహేష్ ఫ్యాన్స్ పైచేయి.. ఆ విషయంలో వెనుకడుగు వేసిన జక్కన్న!
తన సినిమాలతో ఇండియన్ సినిమా దగ్గర ఇపుడు ఆల్ టైం నెంబర్ దర్శకునిగా మారింది ఎవరు అంటే ఎలాంటి డౌట్ లేకుండా అది జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి అనే చెప్పవచ్చు. కాగా ఒకో సినిమాతో ఎంతో ఎత్తుకి ఎదిగిన రాజమౌళి ఇపుడు తన బ్రాండ్ తో హీరోలని పాన్ ఇండియా మార్కెట్ పరిచయం చేస్తున్నారు. ఇలా బాహుబలి సినిమాతో ప్రభాస్ నుంచి మొన్న RRR సినిమాతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ లని కూడా తాను పరిచయం చేశారు.
కాగా ఇక్కడ నుంచి ఓ సినిమా క్రెడిట్ లో రాజమౌళికి సింహ భాగం దక్కాలని తన ఫ్యాన్స్ సహా న్యూట్రల్ ఆడియెన్స్ లో ఉంది. అయితే మన తెలుగు సినిమా స్టార్ హీరోస్ ఫ్యాన్స్ కి ఒక అలవాటు ఉంది. అది ఏ హీరో అభిమానులు అయినా కూడా సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఆ క్రెడిట్ హీరోకి ఒకవేళ ఫెయిల్ అయితే నైస్ గా దర్శకుని మీద తోసేస్తారు. మరి ఇది రాజమౌళి విషయంలో కూడా కొన్నిసార్లు జరిగాయి.

కాగా ఎక్కడ వరకో ఎందుకు ఇపుడు చేస్తున్న మహేష్ బాబు సినిమా అలాగే ముందు RRR సినిమాకి మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో రాజమౌళి వీలైనంత వరకు కాంట్రవర్సీలు పెట్టుకోకూడదు అనే చూస్తున్నట్టుగా అర్ధం అవుతుంది. కొన్ని నిజాలు చెప్పుకోవాల్సి వస్తే RRR అనే సినిమా రామ్ చరణ్ నే ప్రధాన పాత్రగా స్టార్ట్ చేశారు.
రచయిత విజయేంద్ర ప్రసాద్ నుంచి డే 1 సినిమా చూసిన ఏ ఆడియెన్ ని అడిగినా కూడా రామ్ చరణ్ పైనే మొదటి మాట వస్తుంది. సినిమా టైటిల్ సహా గ్లింప్స్, సినిమాలో ఎంట్రీ ఏవి చూసుకున్నా సరే మొదట చరణ్ పాత్ర తోనే మొదలవుతాయి. దీనితో తమ హీరో పక్కకి వెళుతున్నాడని సోషల్ మీడియాలో అప్పట్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన రచ్చకి వీళ్ళతో గొడవలు ఎందుకులే అని మొదట ఎన్టీఆర్ పేరుని ట్యాగ్ చేస్తూ సినిమాలో పొందుపరిచారు.
కాగా ఇపుడు మళ్ళీ ఇదే తరహాలో మహేష్ ఫ్యాన్స్ తో జక్కన్నకి ఇష్యూ నడుస్తుంది. ఆ మధ్య రాజమౌళి కాంపౌండ్ యంగ్ హీరో సింహ కోడూరి మత్తు వదలరా ప్రమోషన్స్ లో SSMB29 అనే ట్యాగ్ కాకుండా SSRMB అనే ట్యాగ్ చెప్పినందుకు సోషల్ మీడియాలో మహేష్ అభిమానులు దానిని తీసుకోలేకపోయారు. తమ హీరోని ఇంటర్నేషనల్ మార్కెట్ కి పరిచయం చేస్తున్న దర్శకుడు అని కూడా చూడకుండా తమ హీరోకే మొదట క్రెడిట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మరి దీనినే సాగదీయడం ఇష్టం లేక రాజమౌళి అప్పుడు ఎన్టీఆర్ విషయంలో చేసినట్టే తాను కూడా SSMB29 అనే ట్యాగ్ నే కంటిన్యూ చేస్తున్నారు. దీనితో ఈ విషయంలో మహేష్ అభిమానులు గెలిచినట్టు అయ్యింది. కాగా ఇలా రాజమౌళి లెటర్ అంటూ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనితో బాబు తర్వాతే ఎవరైనా అంటూ మహేష్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు.


Click it and Unblock the Notifications











