ఇండియన్ హిస్టరీలో SSMB29 రికార్డు.. రామోజీ ఫిలిం సిటీలో సెట్‌తో జక్కన్న సరికొత్త చరిత్ర.. ఎన్ని కోట్లంటే?
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం భారీ హంగులతో షూటింగ్ జరుపుకొంటున్నది. భారీ బడ్జెట్‌తో రూపొందే ఈ సినిమాను కేఎల్ నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకొన్నది. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు రోజు రోజుకు అంచనాలు పెంచేస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెట్ నిర్మాణం వార్త సోషల్ మీడియాలో భారీగా చక్కర్లు కొడుతున్నది. ఆ సెట్ నిర్మాణం ఖర్చు ఎంత? దాని విశేషం ఏమిటనే వివరాల్లోకి వెళితే..
SSMB29 అనే వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ తారలు ప్రియాంక చోప్రా, జాన్ అబ్రహం, మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం విక్రమ్‌ను సంప్రదించగా ఆయన రిజెక్ట్ చేశారనే వార్త ఇటీవల మీడియాలో హల్‌చల్ చేసింది. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం, విజయేంద్ర ప్రసాద్, దర్శకుడు దేవా కట్టా కథ, మాటలు అందిస్తున్నారు.

మహేష్ బాబుతో రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ఒడిశాలోను, అలాగే హైదరాబాద్‌లోను పూర్తి చేసుకొన్నది. ఇక ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు వారణాసి నేపథ్యంలో సాగుతాయి. అయితే కాశీ బ్యాక్ డ్రాప్‌లో షూట్ చేయడం చాలా కష్టం. పబ్లిక్‌ను కంట్రోల్ చేయడం, షూటింగ్‌కు అనేక అవాంతరాలు కలిగితే వాటిని పరిష్కరించడం చాలా కష్టం. కాబట్టి అందుకే ఈ సన్నివేశాలను హైదరాబాద్‌లో చిత్రీకరించేందుకు భారీ సెట్ వేస్తున్నారు.
వారణాసి బ్యాక్ డ్రాప్‌తో హనుమంతుడి కాన్సెప్ట్‌తో రూపొందే ఈ సినిమా కోసం ఇండియాలో ఇప్పటి వరకు వేయని అత్యంత వ్యయపూరితమైన సెట్‌ను రామోజీ ఫిలిం సిటీలో వేస్తున్నారు. ఇందుకోసం సుమారుగా 50 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. భారతీయ సినిమా చరిత్రలో ఇంత పెద్ద సెట్, ఈ రేంజ్ బడ్జెట్‌తో నిర్మించడం ఇదే మొదటిసారి అంటున్నారు.
రామోజీ ఫిలిం సిటీలో అతి ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఆ తర్వాత ఈ సినిమా షూటింగ్ కోసం కెన్యాకు వెళ్తారు. వచ్చే నెల చివరి ఆఖరులో ఈ సినిమా యూనిట్ అంతా కెన్యాకు వెళ్తారు. అక్కడ కొన్ని ఛేజింగ్ సీన్లను చిత్రీకరిస్తారు అనే వార్తలు సోషల్ మీడియాలో వెలుగు చూశాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన విషయాలు మీడియాలో వెలుగు చూస్తూ అందరిలోను అంచనాలు పెంచుతున్నాయి.
దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాను సుమారుగా 1000 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. నిర్మాత కేఎల్ నారాయణ ఇప్పటి వరకు గత 35 ఏళ్లలో కేవలం క్షణక్షణం, హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, దొంగాట, సంతోషం, నిన్నే ఇష్టపడుతాను అనే సినిమాలు నిర్మించారు. 2003 తర్వాత ఆయన మహేష్, రాజమౌళితో కలిసి సినిమాను భారీగా రూపొందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











