»   »  మీ అమ్మాయి కూడా దేవకన్య...కాదా?’’: రాజమౌళి

మీ అమ్మాయి కూడా దేవకన్య...కాదా?’’: రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రెండు రోజుల క్రితం రాజమౌళి...తన తాజా చిత్రం బాహుబలిలోని తమన్నా లుక్ ని రివిల్ చేసారు. ఆ పోస్టర్ పై ‘The Angelic Avenger' అంటూ రాసారు. ఇది చూసిన ఖుష్భూ వెంటనే స్పందించారు. ఆమె కుమార్తె పేరు కూడా అవంతక కావటంతో...అదే విషయం తెలుపుతూ ఇలా ట్వీట్ చేసారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

దానికి రాజమౌళి వెంటనే స్పందిస్తూ.... ఆమె కూడా ఓ దేవకన్య కాదంటారా అంటూ నవ్వుతూ సరదాగా రిప్లై ఇచ్చారు.

అవంతిక పోస్టర్ విషయానికి వస్తే...

'ఆమె అందం ఓ రహస్యం'... అంటూ 'బాహుబలి'లో ఓ ప్రధాన పాత్రధారి తమన్నా గురించి రాసుకొచ్చారు దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. ఆయన దర్శకత్వం వహిస్తున్న 'బాహుబలి' చిత్రంలో ముఖ్య పాత్రధారుల పోస్టర్లను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. తమన్నా పోషిస్తున్న అవంతిక పాత్రకు సంబంధించిన కొత్త పోస్టరును ని విడుదల చేశారు.

'అందాల శక్తి' అంటూ ఆ పాత్ర తీరుతెన్నులు వివరించారు రాజమౌళి. ప్రభాస్‌, రానా, తమన్నా, అనుష్క ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాతలు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. ఎం.ఎం.కీరవాణి స్వరాలందిస్తున్నారు. ఈ నెల 31న పాటల్ని, జులై 10న చిత్రాన్ని విడుదల చేస్తారు.

SS Rajamouli calls Kushboo daughter as angel

కేన్స్ లోనూ...

రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం 'బాహుబలి'. ప్రభాస్‌, రానా, తమన్నా, అనుష్క ప్రధాన పాత్రధారులు. ఆర్కా మీడియా పతాకంపై ప్రసాద్‌ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా జులై 10న 3500 థియేటర్లలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా ప్రచారాన్ని చిత్ర యూనిట్ వినూత్నంగా నిర్వహిస్తోంది.

ఇందులో భాగంగా సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అభిమానులకు పరిచయం చేయడానికి కేన్స్‌ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాన్ని వేదికగా చేసుకొంది. శోభు యార్లగడ్డ, ఛాయాగ్రాహకుడు కె.కె.సెంథిల్‌కుమార్‌, ఎస్‌.ఎస్‌.కార్తికేయ ఆధ్వర్యంలో ఓ బృందం కేన్స్‌కు వెళ్లింది. అక్కడ కేన్స్‌ ప్రతినిధి క్రిస్టియన్‌ జేన్‌ను కలిశారు.

ఈ సందర్భంగా శోభు యార్లగడ్డ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ ''బాహుబలి' రెండు భాగాలు కలిపి 290 నిమిషాల నిడివి ఉంటుంది. అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం సినిమా నిడివి తగ్గించి విడుదల చేస్తాం. ఈ సినిమాను భారతీయ పురాణాల నేపథ్యంలో తెరకెక్కించలేదు. ఇది పూర్తిగా కొత్త కథ'' అని చెప్పారు. ఈ సినిమా అంతర్జాతీయ ప్రచారం కోసం ఫ్రంట్‌నైట్‌ సంస్థ అధిపతి ఫ్రాంకోయిస్‌ డ సిల్వాను తమ బృందంలో కలుపుకొంది చిత్ర నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా.

English summary
veteran actress Kushboo Sundar more delighted with look of Tamanna and her character. The reason being, even her daughter’s name is Avantika. Khushbu Responded on the poster and she shared the same thoughts with Rajamouli on her Twitter account. Rajamouli quickly responded on Kushbu comments and called Khushbu’s daughter as an angel and mentioned she looks very divine.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu