‘బాహుబలి’ సెట్లోనే రాజమౌళి బర్త్‌డే

By Bojja Kumar

హైదరాబాద్: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ ఎవరు? అంటే ముందుగా అందరూ చెప్పే పేరు ఎస్.ఎస్.రాజమౌళి. మోస్ట్ సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాజమౌళి.....ప్రస్తుతం బాహుబలి అనే భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. రాజమౌళి చివరి చిత్రం 'ఈగ' ఇండియాలో మంచి సక్సెస్ సాధించడంతో పాటు అంతర్జాతీయంగా కూడా గుర్తింపు తెచ్చుకుంది.

కర్నాటకలో జన్మించిన రాజమౌళి కె.రాఘవేంద్రరావు శిష్యుడిగా టీవీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత 2001లో వచ్చిన 'స్టూడెంట్ నెంబర్ 1' చిత్రం ద్వారా దర్శకుడిగా మారారు. రాజమౌళి తొలి సినిమా భారీ విజయం సాధించింది. ఆ తర్వాత ఆయన అపజయం అంటూ ఎరుగకుండా వరుస సక్సెస్‌లతో టాప్ డైరెక్టర్‌గా మారారు.

SS Rajamouli

13 ఏళ్ల కెరీర్లో రాజమౌళి 9 సినిమాలకు దర్శకత్వం వహించారు. స్టూడెంట్ నెం.1, సింహాద్రి, సై, చత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ లాంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. తన 10వ సినిమా 'బాహుబలి'ని భారీ బడ్జెట్‌తో తెలుగు సినీ పరిశ్రమ కనీవిని ఎరుగని రీతిలో గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈచిత్రంలో ప్రభాస్, రాణా, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

అక్టోబర్ 10, 1973లో జన్మించిన రాజమౌళి ఈ రోజుతో 40వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. బాహుబలి సినిమా సెట్లోనే ఆయన తన 40వ పుట్టినరోజు వేడుక జరుపుకున్నట్లు సమాచారం. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ట్విట్టర్ ద్వారా రాజమౌళికి శుభాకాంక్షలు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X