ఆలియాభట్‌పై రూమర్లకు రాజమౌళి చెక్.. జక్కన్న ఎమోషనల్ పోస్ట్!

RRR చిత్రం ద్వారా బాలీవుడ్ టాలెంటెండ్ యాక్టర్ అలియాభట్ దక్షిణాది ప్రేక్షకులకు చేరువకానున్నారు. అయితే RRR మూవీ నుంచి అలియా భట్ తప్పుకొన్నారనే వార్తలు ఇటీవల కాలంలో మీడియాలో ఎక్కువగానే కనిపించాయి. అయితే చిత్ర యూనిట్ అలాంటి వార్తలను కొట్టిపడేస్తూ వివరణ ఇస్తూ వచ్చింది. తాజాగా అలియాభట్‌ ఎంపిక వెనుక అసలు విషయాన్ని దర్శక ధీరుడు రాజమౌళి బయటపెట్టారు. రాజమౌళి తాజాగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం..

Recommended Video

Alia Bhatt Surprised All, Became Die Hard Fan Of Prabhas
రామరాజుకు జంటగా సీత

రామరాజుకు జంటగా సీత

RRR మూవీ విషయానికి వస్తే.. అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్ కనిపించబోతున్నారు. రామరాజుకు జోడిగా సీత పాత్ర ఈ చిత్రంలో కీలకంగా మారింది. దాంతో సమకాలీన హీరోయిన్లలో ఎమోషన్లను బలంగా పలికించే తారలు ఎవరనేది పరిశీలిస్తే.. యువ తార అలియాభట్ కంటే మిన్న ఎవరనే ప్రశ్న ఉదయించక మానదు. ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని అలియాభట్‌ను ఎంపిక చేశామని దర్శకుడు రాజమౌళి వివరించారు.

రాంచరణ్, తారక్‌కు సమఉజ్జీగా

రాంచరణ్, తారక్‌కు సమఉజ్జీగా

RRR మూవీకి సంబంధించి సీత పాత్ర తారక్, రామ్ చరణ్‌కు మధ్య బలమై వారధిగా నిలిచే విధంగా ఉండాలి. అలాగే ఆ ఇద్దరు ప్రతిభవంతుల ముందు తన నటనతో సమఉజ్జీగా ఉండే హీరోయిన్ కావాలి. అలాంటి పరిస్థితులను బేరీజు వేసుకొని ఇద్దరు టాలెంటెడ్ నటులకు గట్టిపోటీ ఇచ్చే అలియాభట్‌ను ఎంపిక చేశాం అని రాజమౌళి చెప్పారు.

సీతగా అలియాభట్ పాత్ర ఎలా ఉండాలంటే

సీతగా అలియాభట్ పాత్ర ఎలా ఉండాలంటే

సీత పాత్ర ఎలా ఉంటుందంటే.. చాలా అమాయకంగా కనిపించాలి. అలాగే ఎదురుగా ఉండే ముప్పును గుర్తించి దాడికి సిద్ధంగా ఉండాలి. అలాగే ఎలాంటి స్థితుల్లోనైనా మానసిక ధృడత్వం కలిగి ఉండాలి. ఇలాంటి లక్షణాలను కలబోసి తన పాత్రను తెరపైన పండించే నటి కావాలి. ఆ లక్షణాలన్నీ అలియాభట్‌లో కనిపించాయి అని రాజమౌళి తన పోస్టులో పేర్కొన్నారు.

అనేక విఘ్నాలను దాటుకొని

అనేక విఘ్నాలను దాటుకొని

మోస్ట్ టాలెంటెడ్ అలియాభట్‌ గురించి చెప్పిన విషయాలతో రూమర్లకు రాజమౌళి తెర దించే ప్రయత్నం చేశారు. అనేక విఘ్నాలను, అవాంతరాలను దాటుకొని లాక్‌డౌన్ అనంతరం RRR మళ్లీ పట్టాలెక్కించే ప్రయత్నాన్ని రాజమౌళి చేస్తున్నారు. RRR మొదలు పెట్టినప్పుడు ప్రకటించిన రిలీజ్ డేట్‌ను వరుసగా వాయిదాలు వేస్తూ ఈ సినిమాను సంక్రాంతికి సిద్ధం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X