నాది, నాగార్జునది ఎవరి ఊహకు అందదు: రాజమౌళి

By Bojja Kumar

ఈగ సినిమా నాగార్జున సినిమాకు పోటీ ఇస్తుందని పరోక్షంగా వెల్లడించారు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ''మీ ఊహకందని మాయాజాలం. నాగార్జున ఢమరుకం సినిమాతో ఈగ సినిమాలో భారీగా విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి'' అంటూ తన సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌లో పేర్కొన్నారు. ఈ రెండు సినిమాలు దాదాపుగా ఒకే సమయంలో విడుదలవుతున్న నేపథ్యంలోనే రాజమౌళి ఈ కామెంట్స్ చేశారని ఫిల్మ్ నగర్ జనాలు చర్చించుకుంటున్నారు. మరి ప్రేక్షకులు ఏ సినిమాను ఆదరిస్తారో విడుదలైతేగానీ తెలియదు.

నాగార్జున ఇదివరకు నటించిన సినిమాల కంటే భిన్నంగా భారీ గ్రాఫిక్స్ తో సోషియో ఫాంటసీ చిత్రంగా రూపొందుతున్న డమరుకం మూవీకి సంబంధించి ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ స్టూడియలో గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. ఆడియో ఏప్రిల్ లో విడుదల చేసి, మేలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో అనుష్క హీరోయిన్ గా నటిస్తుండగా, సమీరారెడ్డి ఐటం సాంగులో కనిపించనున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఢమరుకం చిత్రానికి శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి ఆర్ ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

నానీ, సమంత,సుదీప్ ప్రధానపాత్రధారులుగా ఎస్.ఎస్.రాజవౌళి దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'ఈగ'. సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. బలవంతుడైన విలన్ బలహీనమైన ఈగ చేతిలో ఎలా ఓడిపోయాడనేదే చిత్ర కథాంశమని, వినోదం, ఆశ్చర్యం, ఉత్కంఠ కలిగించేలా ఈ చిత్రం రూపొందుతోంది. మార్చి 30న పాటలను, ఏప్రిల్ 12న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X