SS Rajamouli అనుష్క తర్వాత రాజమౌళి మనసు దోచిన హీరోయిన్ ఎవరో తెలుసా?
దర్శకధీరుడు అనగానే గుర్తొచ్చే పేరు రాజమౌళి. అపజయం ఎరుగని దర్శకుడిగా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్‌కు వెళ్లారు. రీసెంట్గా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ రేంజ్‌కు వెళ్లి హాలీవుడ్ ప్రముఖ దర్శకుల చేత ప్రశంసలను అందుకున్నారు. అయితే జక్కన్న ఇప్పటి వరకు ఎంతో మంది హీరోయిన్లతో పనిచేశారు. మరి అందులో ఆయనకు నచ్చిన హీరోయిన్ ఎవరంటే అనుష్క అని ఆయనే స్వయంగా చెప్పారు. అయితే తాజాగా అనుష్క తర్వాత తనకు నచ్చిన హీరోయిన్ ఎవరో చెప్పారాయన. మరి ఇంతకీ ఆమె ఎవరు? జక్కన్న ఎవరి పేరు చెప్పారో స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం..
రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీరియల్‌తో మొదలుపెట్టి స్టూడెంట్ నెం.1తో సినిమాల్లోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ ఇలా వరుస సినిమాలు చేస్తూ వరుస సక్సెస్‌లను అందుకున్నారు. ఈ చిత్రాలన్నింటితో కలిపి చాలా మంది హీరోయిన్లతో పని చేశారాయన. భూమిక, జెనీలియా, శ్రియా, ప్రియమణి, కాజల్ అగర్వాల్, సమంత, అనుష్క శెట్టి, ఆలియా భట్ ఇలా పలువురితో చేశారు. వీరిందరిలో తనకు అనుష్క ఇష్టమైన హీరోయిన్ అని కూడా చెప్పారు. కానీ తనకు నచ్చిన హీరోయిన్ పాత్రల గురించి ఇప్పటివరకు పెద్దగా మాట్లాడినట్టు కనిపించలేదు. అయితే ఇప్పుడు చెప్పారు.

ఇప్పుడాయన కొడుకు ఎస్ఎస్ కార్తికేయ కూడా సినీ ఇండస్ట్రీలోనే రాణిస్తున్నారు. తాజాగా అతడు ప్రేమలు అనే సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశాడు. మాథ్యూ థామస్, నస్లేన్ కె.గఫూర్, శ్యామ్ మోహన్, మమిత బైజు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ను గిరీష్ ఎ.డి. తెరకెక్కించారు. ఫిబ్రవరి 9న మలయాళంలో రిలీజై భారీ సక్సెస్‌ను అందుకుంది. ఇప్పుడు దీన్ని తెలుగులో ఎస్.ఎస్.కార్తికేయ తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేశారు.

శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా దీనిని ఉద్దేశించి రాజమౌళి ఓ ట్వీట్ చేశారు. సినిమా తనకు బాగా నచ్చిందని అన్నారు. ప్రేమలు సినిమాను నా కొడుకు కార్తికేయ తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేయడాన్ని ఆనందిస్తున్నాను. ఈ చిత్రం బాగా నవ్వులు పూయించింది. ఈ సినిమా రచయిత అద్భుతంగా పని చేశారు. ట్రైలర్ చూసినప్పుడు రేణు నాకు బాగా నచ్చింది. అదే ఆమె పాత్ర బాగా నచ్చింది. సినిమా చూశాక సచిన్ కూడా నచ్చాడు. కానీ ఏది ఏమైనా నా ఫేవరెట్ మాత్రం ఆది. అంటూ రాసుకొచ్చారు.

ఇకపోతే ఆర్ఆర్ఆర్తో భారీ హిట్ అందుకున్న రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబు సినిమా కోసం కష్టపడటం మొదలు పెట్టారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. కథ సిద్ధమైపోయింది. లుక్ టెస్ట్ సహా ఇతర పనులు కోసం రెడీ అవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రం కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు రూ.100కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది.


Click it and Unblock the Notifications











