గరుడవేగపై రాజమౌళి సెన్సేషనల్ ట్వీట్.. రాజశేఖర్ రిప్లై అదుర్స్
దర్శకుడు ప్రవీణ్ సత్తారు, హీరో రాజశేఖర్ కాంబినేషన్‌లో వచ్చిన పీఎస్‌వీ గరుడవేగ చిత్రం తొలి రోజునే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకొన్నది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌పై సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా సంచలన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అదేమింటంటే..
Recommended Video


సక్సెస్ టాక్‌తో దూసుకుపోతున్న
సక్సెస్ టాక్‌తో దూసుకుపోతున్న పీఎస్వీ గరుడ వేగ యూనిట్ సభ్యులకు ఎస్ఎస్ రాజమౌళి అభినందనలు చెబుతూ..
కంగ్రాట్యులేషన్ టీమ్ పీఎస్వీ గరుడ వేగ. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వస్తుంది అని తెలుసుకొన్నాను. ఆదివారం రోజు సినిమా చూడటానికి టికెట్స్ బుక్ చేసుకొన్నాను అని ట్వీట్ చేశారు.

రాజమౌళి ట్వీట్‌కు రాజశేఖర్ రిప్లై
రాజమౌళికి ట్వీట్‌కు హీరో రాజశేఖర్ వెంటనే స్పందించారు. ‘ధన్యవాదాలు సర్. మీ మాటలు మాకు చాలా బలాన్ని ఇచ్చాయి' అని ట్వీట్ చేశారు. చాలా రోజుల తర్వాత రాజశేఖర్ సక్సెస్ ఎంజాయ్ చేస్తు తన ఆనందాన్ని షేర్ చేసుకొంటున్నారు. తాజాగా సోషల్ మీడియాలో రాజశేఖర్ యాక్టివ్‌గా కనిపించడం గమనార్హం.

సక్సెస్ వేడుకల్లో యూనిట్
సక్సెస్ టాక్ వచ్చిన నేపథ్యంలో గరుడవేగ సినిమా యూనిట్ వేడుక చేసుకొన్నారు. ఈ వేడుకకు దర్శకుడు ప్రవీణ్ సత్తారు, హీరో రాజశేఖర్, జీవిత, హీరోయిన్లు శ్రద్దాదాస్, పూజకుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన సెల్పీని శ్రద్ధాదాస్ ట్వీట్ చేశారు.

గరుడ వేగకు అనూహ్య స్పందన
పూజా కుమార్, శ్రద్ధాదాస్, కిశోర్, నాజర్, పోసాని కృష్ణమురళి పీఎస్వీ గరుడవేగ 126.18 ఎమ్'లో ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం నవంబర్3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి అనూహ్య స్పందన లభిస్తున్నది. బాలీవుడ్ నటి సన్నీలియోని ప్రత్యేక గీతంలో మెరిసారు. భీమ్స్ సిసిరోలియో స్వరాలు అందించారు. ఎం. కోటేశ్వర్ రాజు నిర్మాతగా వ్యవహరించారు.


Click it and Unblock the Notifications











