»   » మహేష్ కు కథ వినిపించా...నచ్చింది: రాజమౌళి

మహేష్ కు కథ వినిపించా...నచ్చింది: రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్‌, రాజమౌళి కాంబినేషన్ సినిమా కన్ఫర్మ్ అయినట్లే. ఇందుకోసం తొలి అడుగులు రీసెంట్ గా పడ్డాయి. ఈ అ విషయాన్ని రాజమౌళి ...ట్విట్టర్ లో తెలియచేస్తూ...ఇటీవలే మహేష్‌ ఇంటికి వెళ్లాను..ఓ స్టోరీలైన్ వినిపించాను. అది మహేష్ కు బాగా నచ్చింది. అదే కథతో చేస్తామో లేదోగానీ ప్రస్తుతానికి చాలా ఆనందంగా ఉందన్నారు. ఇక మహేష్ కూడా రాజమౌళిని తన ట్విట్టర్ లో పొగడ్తల్లో నింపేస్తూ ట్వీట్ చేసారు. వాస్తవానికి మగధీర అనంతరం మహేష్, రాజమౌళి కాంబినేషన్ ప్రారంభం కావల్సి ఉంది. అయితే మహేష్ డేట్స్ దొరకకపోవటం, నిర్మాత ఇంకా రెడీ కాకపోవటం వంటి కారణాలతో ఈ ప్రాజెక్టు మెటీరియలైజ్ కాలేదు. అయితే ఈ సూచనలను బట్టి త్వరలోనే ఈ ప్రాజెక్టు ప్రారంభం అయ్యే వాతావరణం కనపడుతోంది. అభిమానలు సైతం ఈ క్రేజీ ప్రాజెక్టు కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం రాజమౌళి సునీల్ తో చేస్తున్న 'మర్యాద రామన్న'కి తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇక త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మహేష్‌ నటిస్తున్న చిత్రం పూర్తి కావచ్చింది. సంక్రాంతికి రిలీజయ్యేలా శ్రీను వైట్ల కాంబినేషన్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu