Rajamouli: నా ప్రయాణంలో భాగస్వామివి.. దర్శకధీరుడి ఎమోషనల్ కామెంట్
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినీ జీవిత ప్రయాణంలో రాజమౌళిది ప్రత్యేకస్థానం. అలాగే రాజమౌళి సినీ ప్రయాణంలోనూ ఎన్టీఆర్‌ది ప్రత్యేక స్థానమే. ఎన్టీఆర్‌కు మొదటి విజయాన్ని అందించింది రాజమౌళినే. స్టూడెంట్ నెం.1 చిత్రంతో చిత్రసీమలో తమకంటూ ఓ స్థానాన్ని క్రియేట్ చేసుకున్నారు ఆ ఇరువురు. ఈ ఇద్దరి బంధం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ కొట్టేసిన ఈ ద్వయం.. ఆర్ఆర్ఆర్‌తో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టేందుకు రెడీ అవుతున్నారు. నేడు ( మే 20 ) యంగ్ టైగర్ బర్త్ డే సందర్భంగా రాజమౌళి ఎమోషనల్ అయ్యాడు.

ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్..
ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా.. ఆర్ఆర్ఆర్ నుంచి ఏదో ఒక సర్‌ప్రైజ్ వస్తుందని అంతా భావించారు. అయితే ప్రస్తుతం నెలకొన్ని ఉన్న పరిస్థితులు దృష్ట్యా అది సాధ్యపడలేదని, క్షమించమని ఆర్ఆర్ఆర్ టీమ్ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే అలాంటి వారందరి కోసం అదిరిపోయే స్పెషల్ గిఫ్ట్‌ను ఇచ్చాడు ఎన్టీఆర్.

సిక్స్ ప్యాక్‌తో హల్చల్..
ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఎలాంటి ఫస్ట్ లుక్, సినిమా అప్‌డేట్స్ ఇ్వవకపోయినా ఒకే ఒక్క ఫోటోతో అన్నింటికి సమాధానమిచ్చారు. సిక్స్ ప్యాక్ బ్యాడీతో ఎన్టీఆర్ రొమాంటిక్ లుక్‌తో అందరూ ఫిదా అయ్యారు. ఇక ఈ ఫోటో నిన్నటి నుంచి తెగ చక్కర్లు కొడుతోంది. నేటి ఎన్టీఆర్ బర్త్ డే వేడుకల్లో అదే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

ఎమోషనల్ పోస్ట్
తాజాగా రాజమౌళి ఎన్టీఆర్ బర్త్ డేపై స్పందిస్తూ.. ఎమోషనల్ పోస్ట్ చేశాడు. నా సినీ ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుంచి నువ్ నా భాగస్వామిగా ఉన్నావ్.. అందుకు చాలా సంతోషంగా ఉంది. హ్యాపీ బర్త్ డే డియర్ తారక్. నీ కంటే మంచి భీమ్‌ను నేను కనిపెట్టలేను' అని చెప్పుకొచ్చాడు.

ఇలాంటోడు నా హీరోనా?
ఆ మధ్య స్టూడెండ్ నెం. షూటింగ్ విశేషాలను చెప్పుకొస్తూ.. ఎన్టీఆర్‌పై ఆసక్తికరమైన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి వాడు నా హీరో ఏంటని మొదట్లో అనుకున్నానని, తరువాత తన తప్పేంటో తెలుసుకున్నానని అంటూ ఎన్టీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.


Click it and Unblock the Notifications











