ఎన్టీఆర్‌ను ఆ పరిస్థితుల్లో చూసి రాజమౌళి కంటతడి.. జన్మలో అలాంటి క్లైమాక్స్ పెట్టకుండా జక్కన్న షాకింగ్ నిర్ణయం!
దర్శకధీరుడు రాజమౌళి ఇండియన్ సినిమా హిస్టరీలోనే ప్రస్తుతం నెంబర్ వన్ డైరెక్టర్ గా సత్తా చాటుతున్నారు. అయితే ఈ డైరెక్టర్ సినిమాల్లోకి రాకముందే తను తీయబోయే సినిమాల విషయంలో ఒక రూల్ పెట్టుకున్నారట. ఎన్టీఆర్ కారణంగా చచ్చినా తన సినిమాల్లో ఆ రకమైన ఎండింగ్ పెట్టనని శపథం చేసుకున్నారట. మరి ఇంతకీ జక్కన్న పెట్టుకున్న ఆ రూల్ ఏంటి? దానికి సీనియర్ ఎన్టీఆర్ ఎలా కారణం అయ్యారు? అనే ఇంట్రెస్టింగ్ విషయంపై లుక్కేద్దాం.
బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో ప్రపంచం మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు చూసేలా, ఇంటర్నేషనల్ సినిమా రంగంలో టాలీవుడ్ తల ఎత్తుకునేలా చేసిన డైరెక్టర్ రాజమౌళి. తెలుగు సినిమా ఖ్యాతిని ఇంతలా పెంచి ఇప్పటిదాకా టాలీవుడ్ కలలుగన్న ఆస్కార్ ని తెచ్చిపెట్టాడు.

ఇకపై SSMB29 మూవీతో తెలుగు సినిమా కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరి ఈ రేంజ్ లో దూసుకెళ్తున్న జక్కన్న తన సినిమాల విషయంలో మాత్రం ఒక రూల్ ని మాత్రం పక్కాగా పాటిస్తారట. దానికి ముఖ్య కారణం సీనియర్ ఎన్టీఆర్ అని సమాచారం. మరి వీళ్ళిద్దరికీ మధ్య ఉన్న కనెక్షన్ ఏంటి? జక్కన్న ఎప్పుడో సినిమాల్లోకి రాకముందే తన సినిమాలు ఎలా ఉండాలో డిసైడ్ అవ్వడానికి ఎన్టీఆర్ ఎలా కారణమయ్యారు? అంటే...
జక్కన్నకు చిన్నప్పటి నుంచే యాక్షన్ సినిమాలు అంటే బాగా ఇష్టమట. లవ్ స్టోరీస్ ను పెద్దగా పట్టించుకోని ఆయన యాక్షన్ మూవీస్ అంటే మాత్రం బాగా ఇంట్రెస్ట్ కనబరిచేవారట. ఇక చిన్నప్పుడు తమ ఫ్యామిలీ చాలా పెద్దదని, తామంతా 13 మంది కజిన్స్ అని ఓ ఇంటర్వ్యూలో జక్కన్న చెప్పుకొచ్చారు.

అయితే అందులో పెద్దవాళ్ళు నెలకి రెండు సినిమాలు, చిన్నవాళ్లు మాత్రం నెలకు ఒక్క సినిమానే చూసేలా కండిషన్ పెట్టారట ఇంట్లో. ఇక ఈ నేపథ్యంలోనే ఒకానొక సమయంలో తమ ఊర్లో రెండు థియేటర్లు ఉండగా, అందులో ఒక థియేటర్లో అగ్గి పిడుగు, మరో థియేటర్లో మంచి చెడు అనే సినిమాలో రిలీజ్ అయ్యాయట. ఆ రెండు సినిమాల్లోనూ ఎన్టీఆర్ హీరో కావడం విశేషం.
అయితే అగ్గి పిడుగు సినిమాను చూసిన పెద్దవాళ్లు సినిమాలో కత్తి ఫైట్లు వంటి యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి అని చెప్పడంతో ఎలాగైనా వచ్చేవారం అదే మూవీ చూడాలని రాజమౌళి అండ్ టీం వెయిట్ చేశారట. కానీ అగ్గిరాముడు సినిమాకు వెళ్దామని రెడీ అయితే మంచి చెడు మూవీకి వెళ్దామని, అందులో కూడా అన్నీ ఫైట్లే ఉన్నాయని అబద్ధం చెప్పి జక్కన్నను కన్విన్స్ చేశారట పెద్దవాళ్ళు.
సినిమా మొత్తం వెయిట్ చేసినా మంచి చెడులు మూవీలో యాక్షన్స్ సన్నివేశాలు రాకపోవడంతో జక్కన్న ఏడ్చి గోల గోల చేశారట. ఇక చివరికి సినిమాలో ఎన్టీఆర్ చనిపోవడంతో ఆ ట్రాజెడీ ఎండింగ్ చూశాక రాజమౌళికి చిరాకు నషాళానికి ఎక్కిందట. అప్పటికే సినిమాలో యాక్షన్ సన్నివేశాలు లేవని మండిపోతుంటే మరోవైపు ఎండింగ్ లో హీరోని చంపేశారు.దీంతో రాజమౌళి ఒకవేళ తాను సినిమాలు తీస్తే జన్మలో అలాంటి ఎండింగ్ పెట్టకూడదని అప్పుడే డిసైడ్ అయ్యారట. జక్కన్న ఛత్రపతి మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించారు.


Click it and Unblock the Notifications











