twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR-SS Rajamouli: ఎల్లలు దాటిన రాజమౌళి రేంజ్.. మరోసారి అరుదైన అవార్డు!

    |

    దర్శకధీరుడు రాజమౌళి చెక్కిన కళాఖండం RRR చిత్రం. కొమురం భీమ్ గా యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతి ఎల్లలు దాటింది. సుమారు రూ. 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపుగా రూ. 1200కుపైగా కోట్లు కలెక్ట్ చేసింది. ఇక ఇటీవల జపాన్ లో విడుదలైన ఈ చిత్రం అత్యధిక ఆక్యుపెన్సీతో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే ఇప్పటివరకు ఈ సినిమా ఎన్నో అవార్జులను అందుకోగా తాజాగా దర్శక దిగ్గజం రాజమౌళి అరుదైన అవార్డు అందుకున్నారు.

    టీవీ సీరియల్ తో కెరీర్..

    టీవీ సీరియల్ తో కెరీర్..

    తెలుగు చిత్రసీమలో అపజయం ఎరగని దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది అందరూ ముక్త కంఠంతో చెప్పే పేరు ఎస్ఎస్ రాజమౌళి. శాంతి నివాసం అనే టీవీ సీరియల్ తో ప్రారంభమైన ఆయన సినీ కెరీర్ నేడు ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా చేసింది. జూనియర్ ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1 చిత్రంతో సినిమా దర్శకుడిగా పరిచయమైన రాజమౌళి తాజాగా RRR మూవీతో వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. మొదటి సినిమా నుంచి RRR వరకు ఆయన తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అందుకే ఆయన్ను ఓటమెరుగని ధీరుడు అని పిలుస్తుంటారు.

    ఆస్కార్ కంటే ముందుగా..

    ఆస్కార్ కంటే ముందుగా..

    దర్శక ధీరుడు రాజమౌళి చెక్కిన కళా ఖండాలు అనేకం. ఆయన తెరకెక్కించిన మగధీర, ఈగ, బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కంక్లూజన్, ఆర్ఆర్ఆర్ చిత్రాలు తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాయి. ప్రపంచానికి చాటి చెప్పాయి. దీంతో రాజమౌళి సినిమాకు హాలీవుడ్ నుంచి అవార్డుల పంట మొదలైంది. RRR సినిమా ఆస్కార్ అందుకుంటే చూడాలని భారతీయ ప్రేక్షకులు ఎంతగానో ఆశపడుతున్నారు. అందుకోసం ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఆస్కార్ కంటే ముందుగా విదేశాల్లో పేరున్న ఫిల్మ్ ఫెస్టివల్స్ కు RRRను పంపిస్తున్నారు. ఈ సినిమా చూసిన విదేశీయులు ఫిదా అవుతున్నారు. ఫలితంగా అవార్డులు అందిస్తున్నారు.

    రెండో ఇంటర్నేషనల్ అవార్డు..

    ప్రతి ఏడాది న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డులు ఇస్తోంది. వివిధ వార్తా పత్రికలు, మ్యాగజైన్స్, ఆన్ లైన్ మీడియా సంస్థలకు చెందిన క్రిటిక్స్ ఒక బృందంగా ఏర్పడి ఈ అవార్డులు అందిస్తున్నారు. చిత్ర పరిశ్రమలో అత్యున్నతమైన ప్రతిభ కనబర్చిన వారికి దాదాపుగా 1935 నుంచి న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డులు అందిస్తోంది. ఈ ఏడాది RRRకు గానూ ఉత్తమ దర్శకుడిగా రాజమౌళికి అవార్డు అందజేశారు. ఇదే కాకుండా ఇప్పటికే.. సన్ సెట్ సర్కిల్ అవార్డుల్లో నాలుగు ఇంటర్నేషనల్ సినిమాలతో పోటీపడి ఉత్తమ అంతర్జాతీయ సినిమా విభాగంలో RRR విజేతగా గెలిచింది. ఇందులో ఉత్తమ దర్శకుడి విభాగంలో రాజమౌళి రన్నరప్ గా నిలిచారు. ఈ సినిమాకు గానూ రాజమౌళికి ఇది తొలి ఇంటర్నేషనల్ అవార్డ్. ఇప్పుడు న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు రెండోది.

    English summary
    Director SS Rajamouli Wins Best Director Award For RRR Movie At New York Film Critics Circle
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X