రవితేజ, రాజమౌళి కాంబినేషన్లో త్వరలో మరో ప్రాజెక్టు ప్రారంభం కానుందని సమాచారం. ఇందునిమిత్తం విజన్ టైటిల్ ని ఫిల్మ్ ఛాంబర్ లో నమోదు చేసారు. ఇక ఈ చిత్రాన్ని రమా రాజమౌళి నిర్మిస్తూండగా..ఎప్పటిలాగానే విజయేంద్రప్రసాద్ మాస్ మసాలా కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్లో విక్రమార్కుడు చిత్రం వచ్చి సూపర్ హిట్టయింది. దాంతో ఇప్పటి నుంచే ఈ సినిమాపై హైప్ ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం మే రెండవ వారంలో రిలీజ్ కానున్న మగధీర చిత్రం వర్క్ ని ఫినిష్ చేస్తున్నారు. రామ్ చరణ్ తేజ, కాజల్ కాంబినేషన్లో పునర్జన్మ నేపధ్యంలో ఈ చిత్రం రూపొందింది. రవితేజ చిత్రం తర్వాతే సునీల్ తో కామెడీ చేస్తారని తెలుస్తోంది.