నా పేరుకు అర్దం ఏమిటంటే...రాజమౌళి
రాజమౌళి తన పేరుకున్న అర్దాన్ని తాజాగా ట్విట్టర్ ద్వారా తెలియపరిచారు. ఆయన ట్వీట్ చేసిందేమిటంటే...రాజ అంటే చంద్రుడు. మౌళి అంటే తల..ఎవరైతే తలపై చంద్రుడుని మోస్తారో వాళ్ళే రాజమౌళి..ఆయన లార్డ్ శివ అని అర్ధం తెలియపరిచారు. ఇక మర్యాద రామన్న విజయం తర్వాత ప్రస్తుతం రాజమౌళి ఏం చేస్తున్నారు..ఏం చేయబోతున్నారు అనే సందేహం అందరికీ కలుగుతుంది. దానికి సమాధానంగా రాజమౌళి చెబుతూ...నేను ప్రస్తుతం ఈగ సబ్జెక్టు మీద వర్క్ చేస్తున్నాను. ఓ నెలలో ఈ చిత్రం గురించి పూర్తి డెశిషన్ తీసుకుంటాను అంటున్నారు. ఇక ప్రభాస్ చిత్రం నెక్ట్స్ మార్చిలో మొదలవతుంది. ఈ లిమిటెడ్ సమయంలో ఓ చిన్న సినిమా చేస్తాను. ఇక ఈగ చిత్రం యానిమేషన్ మరియు లైవ్ యాక్షన్ తో నిండి ఉంటుంది అన్నారు. అలాగే 'ఈగ' చిత్రంలో ఈగ మాత్రమే గ్రాఫిక్స్ అనీ మిగతా పాత్రల్లో మనుష్యులు ఉండనున్నారని చెప్తున్నారు. ఇక కథ మొత్తం 'ఈగ' పాయింట్ ఆఫ్ వ్యూలో జరుగుతుంది.అలాగే రాజమౌళి..హెచ్ ఎమ్ టీవీ కోసం..కమాన్ ఇండియా అనే పోగ్రాం ని చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











