»   » రామ్‌చరణ్ పుట్టినరోజున ఎన్టీఆర్ అభిమానులకు గిఫ్ట్..!

రామ్‌చరణ్ పుట్టినరోజున ఎన్టీఆర్ అభిమానులకు గిఫ్ట్..!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rajamouli Releases Trailer On RamCharan's Birthday

మెగా అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు ఎదురుచూస్తున్న రాజమౌళి కాంబినేషన్ ఎట్టకేలకు ప్రకటన వచ్చేసింది. అయితే ఈ నెల ఈ నెల(మార్చి 27)వ తేదీన రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా చరణ్ అభిమానులకే కాదు. ఎన్టీఆర్ అభిమానులకు కూడా గిఫ్ట్ లభించనుంది. చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ సినిమాకు సంబంధించి ఫస్ట్‌లుక్‌ను రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయనున్నారు.

ఆనవాయితీ కొనసాగిస్తున్న రాజమౌళి

ఆనవాయితీ కొనసాగిస్తున్న రాజమౌళి

ఇటీవల ఎన్టీఆర్, చరణ్ అమెరికా వెళ్ళి అక్కడ దీనికి సంబంధించి ఫోటో షూట్‌లో కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. 'బాహుబలి' సమయంలో ఆర్టిస్టుల పుట్టిన రోజున వారికి సంబంధించిన స్టిల్స్‌ను రాజమౌళి రిలీజ్ చేసేవారు. అదే ఆనవాయితి కొనసాగించే అవకాశం ఉంది.

ఆర్ఆర్ఆర్

ఆర్ఆర్ఆర్

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతున్న చిత్రాన్ని ఇటీవల అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆర్ఆర్ఆర్ అనే యాష్‌ట్యాగ్ ఓ టీజర్ విడుదల చేశారు. డివివి ఎంటర్టెన్మెంట్స్ బేనర్లో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ

ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ

ఈ టీజర్‌‌లోని మూడు ఆర్‌లు రాజమౌళి, రామ్‌చరణ్‌, రామారావు (ఎన్టీఆర్‌)ల పేర్లు ప్రతిబింభించేలా డిజైన్‌ చేయడం విశేషం. ఈ నెల 27న మరోసారి అభిమానులకు రాజమౌళి షాక్ ఇవ్వడానికి సిద్దమవుతున్నారనే వార్త ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ పెంచుతున్నది.

రంగస్థలంపైనే రాంచరణ్ ఆశలు

రంగస్థలంపైనే రాంచరణ్ ఆశలు

ఇక బోయపాటితో చరణ్ చేస్తోన్న మూవీ నుంచి కూడా ఒక పోస్టర్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా నటించిన రంగ స్థలం విడుదలకు సిద్దం కాగా, ఆ సినిమా ప్రమోషన్ పనుల్లో చెర్రీ బిజీగా ఉన్నాడు. మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దం అవుతున్న రంగస్థలం సినమాపైనే చెర్రీ ఎక్కువగా ఆశలు పెట్టుకుని ఉన్నాడు.

English summary
RRR movie Announcemened. Starring NTR, Ram Charan. Again Rajamouli going to surprise mega fans. He is planning to release a teaser about the movie on Ram Charans birthday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X