twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళికి ఆ హీరో ఝలక్... అందుకే జక్కన్న రాజీ పడ్డారా?

    |

    Recommended Video

    SS Rajamouli Compromise With Bollywood Hero For RRR | Ramcharan | NTR | Filmibeat Telugu

    గతంలో ఎన్నడూలేని విధంగా తాను తెరకెక్కించే సినిమా వివరాలను ప్రెస్ మీట్ పెట్టి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన దాఖలాలు లేవు. తాజాగా RRR మూవీ గురించి మీడియా సమావేశంలో వెల్లడించడంతో ఆ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అంతేకాకుండా ఆలియాభట్, అజయ్ దేవగన్, డైసీ ఎడ్గర్ జోన్స్ బాలీవుడ్ తారలు నటిస్తున్నారనే విషయం చెప్పడం మరింత హైప్ పెరిగింది. అయితే అజయ్ దేవగన్‌ను ఓ కీలకపాత్ర కోసం ఒప్పించడం రాజమౌళి పెద్ద కసరత్తే చేశారట. అదేమిటంటే..

    అజయ్ దేవగన్ షాకింగ్ కామెంట్స్

    అజయ్ దేవగన్ షాకింగ్ కామెంట్స్

    ఎస్ఎస్ రాజమౌళి ప్రెస్ మీట్ కంటే కొన్ని రోజుల ముందు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ RRR సినిమాలో నటించడం లేదని స్పష్టం చేశారు. ఆ సినిమాలో నటిస్తున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు అని చెప్పారు. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకే అజయ్ దేవగన్ RRR చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సినీ వర్గాలకు షాకిచ్చింది.

    పట్టు విడువని జక్కన్న

    పట్టు విడువని జక్కన్న

    సినిమాకు సంబంధించిన వర్గాలు వెల్లడించిన ప్రకారం.. ఉత్తరాది భారతంలో స్వాతంత్ర్య సమరయోధుడి పాత్రను అజయ్ దేవగన్‌‌కు రాజమౌళి ఆఫర్ చేశారట. అయితే ఆ పాత్ర నిడివి తక్కువగా ఉండటం, అంతేకాకుండా ఆ పాత్ర స్వరూపం చూసి కొంత వెనుకడుగు వేశాడట. కానీ రాజమౌళి పట్టు విడువలేదట.

    నిడివి, పారితోషికం పెంపు

    నిడివి, పారితోషికం పెంపు

    ఎలాగైనా అజయ్ దేవగన్‌తో ఆ పాత్రను వేసే ఉద్దేశంతో నిడివిని కూడా పెంచారట. అజయ్ అడిగిన రెమ్యునరేషన్‌ను కూడా ఇవ్వడానికి జక్కన ముందుకొచ్చారట. దాంతో అజయ్ దేవగన్ ఒకే అని నటించడానికి ముందుకొచ్చాడట. ఇదంతా రాజమౌళి ప్రెస్ మీట్‌కు కొన్ని రోజుల ముందు జరిగిన డెవలప్‌మెంట్స్ అని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

    విలన్ పాత్ర కాదని

    విలన్ పాత్ర కాదని

    రాజమౌళి నిర్వహించిన ప్రెస్ మీట్‌లో అజయ్ దేవగన్‌ది విలన్ పాత్ర కాదని స్పష్టమైంది. రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు విలన్ పాత్ర అని మీరు ఎలా అనుకొంటారు? అని రాజమౌళి ప్రశ్నించారు. అయితే తాను ఆ పాత్రను రివీల్ చేయను అని జక్కన్న ట్విస్ట్ ఇచ్చారు.

     పలు భాషల్లో RRR మూవీ

    పలు భాషల్లో RRR మూవీ

    జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రానికి నిర్మాతగా డీవీవీ దానయ్య వ్యవహరిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైనర్‌పై రూపొందించే ఈ చిత్రం 2020 జూలై 30న విడుదల కానున్నది. దేశంలోని అన్ని భాషల్లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    English summary
    Director SS Rajamouli finally unveiled details of his upcoming film RRR starring Jr NTR and Ram Charan as the leads, in a recently held press conference in Hyderabad. The inclusion of Bollywood actors Alia Bhatt and Ajay Devgn in the film has given rise to a great deal of interest surrounding the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X