అందుకే నరేంద్ర మోడీని రాజమౌళి మెచ్చుకున్నారు
ప్రముఖ దర్శకుడు రాజమౌళి తాజాగా ట్విట్టర్ లో నరేంద్రమోడి పై ప్రసంశలు కురింపించారు. అందులో...వైబ్రాంట్ గుజరాత్ మేలా ఒక్క రోజులో పదిహేను లక్షల కోట్ల రూపాయల పెట్టబడిని రప్పించింది.వాటే ఏన్ ఎచీవ్ మెంట్...వాటే ఎ మ్యాన్...హ్యాట్యాఫ్ నరేంద్ర మోడి జీ అంటూ స్పందించారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలతో కార్పొరేట్ పెట్టుబడులు గుజరాత్‌కు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం ఇక్కడ ప్రారంభమైన వైబ్రెంట్ గుజరాత్ 2011 మేళాలో తొలిరోజునే కార్పొరేట్ రంగం నుంచి రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులకు హామీ పొందింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్, అహ్మదాబాద్‌కు చెందిన అదానీ గ్రూప్ మెగా పెట్టుబడులను ప్రకటించాయి.ఇక రాజమౌళి ప్రస్తుతం ఈగ అనే చిత్రం రూపొందిస్తూ బిజీగా ఉన్నారు.
రాజమౌళి నరేంద్రమోడి వైబ్రాంట్ మేళా ఈగ సింహాద్రి యమదొంగ rajamouli narendra modi egga yamadonga jr ntr


Click it and Unblock the Notifications