అతడి డిప్ప మీద గట్టిగా కొట్టాలనిపించింది.. స్పీచ్‌తో అదరగొట్టిన SS రాజమౌళి!
మలయాళ చిత్రం ప్రేమలు సినిమా దక్షిణాదిలో సంచలన విజయం సాధించింది. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మార్చి 8వ తేదీన ఈ సినిమా తెలుగు భాషలో డబ్బింగ్ చిత్రంగా రిలీజైంది. ఈ సినిమా తెలుగులో కూడా మంచి వసూళ్లు సాధిస్తున్నది. ఈ సినిమాను ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు కార్తీకేయ డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఈ సినిమా సక్సెస్ సాధించిన నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో రాజమౌళి మాట్లాడుతూ.. మా అబ్బాయి డిస్ట్రిబ్యూషన్‌లోకి వచ్చాడు. ఈ సినిమా రోజు రోజుకు కలెక్షన్లు పెంచుకొంటూ పోతున్నదని అన్నారు. ఈ సక్సెస్ మీట్‌లో రాజమౌళి మాట్లాడుతూ..
నాకు మలయాళ భాషతో చిన్న సరదా సంబంధం ఉంది. నేను టెలివిజన్ సీరియల్‌కు దర్శకత్వం వహించే సమయంలో నాకు ఓ ఫ్రెండ్ ఉండేవాడు. సెట్లో ఎందా మాషే అంటూ పిలిచే వాడిని. ఎందుకంటే మా పెద్ద అన్నయ్య మలయాళం సినిమా చేసే సమయంలో ఎందా మాషే అని అతడిని పిలిచే వాడు. అలాగే ఆ పదాన్ని నేను నా ఫ్రెండ్‌ను అలా పిలుస్తు ఉండే వాడిని. అతడు కూడా నన్ను ఎందా మాషే అనే వాడు. అయితే కొన్నాళ్లు పోయిన తర్వాత ఎంద మాషే అంటే ఏమిటి అని అడిగాడు. అందుకు నేను ఎంది బాస్ అని అర్ధమని చెప్పాను. దాంతో నీవు నన్ను తిడుతున్నావని.. నేను కూడా తిట్టాలని అలా పిలిచానని చెప్పాడు అని రాజమౌళి చెప్పారు.

ప్రేమలు సినిమా విషయానికి వస్తే.. లవ్, రొమాంటిక్ సినిమాలు అంటే నచ్చవు. కానీ కార్తీకేయ ఈ సినిమా చేస్తున్నానని చెబితే.. పెద్దగా ఆసక్తి చూపలేదు. సినిమా హిట్ అయిందని తెలిసినప్పటికీ.. ఏదో అనాసక్తిగా సినిమాకు వెళ్లాను. సినిమా మొదలైన తర్వాత 10, 15 నిమిషాల తర్వాత నవ్వడం మొదలుపెట్టి.. చివరి సీన్ వరకు నవ్వుతూనే ఉన్నాను. ఈ సినిమా పక్కా థియేట్రికల్ మూవీ. ఈ సినిమాకు తెలుగు మాటలు రాసిన రైటర్ ఆదిత్య హాసన్ హైలెట్. ఇన్స్‌టాగ్రామ్ మీమ్స్ అన్ని చూసినట్టు అనిపించింది అని అన్నారు.
మలయాళం సినిమా ఇండస్ట్రీలో బెటర్ యాక్టర్స్ ఉంటారు. ఇది నేను జెలసీ పడుతూనే చెబుతున్నాను. ఈ సినిమాలో నాకు అమూల్ క్యారెక్టర్ బాగా నచ్చింది. ఎందుకంటే మా పెదనాన్న నన్ను అమూల్ అని పిలుస్తాడు. అందుకే ఆ పాత్రకు నేను కనెక్ట్ అయ్యాను. ఈ చిత్రం ట్రైలర్ సినిమా చూసినప్పుడు మమితాను చూసి ఇష్టపడ్డాను. గీతాంజలిలో గిరిజ, సాయిపల్లవి మాదిరిగా ఆమె యువత హృదయాలను దోచుకొనే హీరోయిన్ అవుతుందని అనుకొంటున్నాను అని అన్నారు.

ఇక సచిన్ చూస్తే బాగున్నాడనిపిస్తుంది. సినిమా చూస్తినప్పుడు అతడి పెర్ఫార్మెన్స్ బాగా నచ్చింది. వాస్తవ జీవితంలో అలాంటి తాగుబోతులను చూస్తే డిప్ప మీద ఒకటి కొట్టాలనిపిస్తుంది. జీవితంలో ఎలాంటి గోల్ లేకుండా ఒక విజన్ లేకుండా వృద్ధిలోకి వచ్చే వాళ్లుంటారు. అలాంటి క్యారెక్టర్‌లో బాగా పెర్ఫార్మెన్స్ చేశాడు. చివర్లో ఒక ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. అది నాకు బాగా నచ్చింది. ఆ సీన్ చూసి థియేటర్ దద్దరిల్లింది. మేము ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకోవడానికి యాక్షన్ సీన్లు తీయడానికి కష్టపడుతాం. కానీ ఒక్క ఎక్స్‌ప్రెస్‌తో థియేటర్లలో అందరి చేత చప్పట్లు కొట్టించాడు అని రాజమౌళి అన్నాడు.
ఈ సినిమాలో బెస్ట్ క్యారెక్టర్ ఆది. నాకు చిరాకు తెప్పించిన క్యారెక్టర్. ప్రతీ ఒక్కరి జీవితంలో ఆది లాంటి వ్యక్తులు ఉంటారు. నా జీవితంలో కూడా ఆది లాంటి వ్యక్తులు ఉన్నారు. కృష్ణుడి వేషంలో ఆది వచ్చినప్పుడు సచిన్, అముల్ చూసి నవ్వుకొన్నే సీన్ చూసి నా పొట్ట చెక్కలైంది. ఆది పాత్ర నాకు బాగా నచ్చింది. ఇలాంటి క్యారెక్టర్లు రాసిన దర్శకుడు గిరీష్‌కు ధన్యవాదాల అని రాజమౌళి అన్నారు.


Click it and Unblock the Notifications











