కమల్ హాసన్ తో రాజమౌళి ఇంటర్వూ
రాజమౌళి ట్వీట్ లో...
"ఈ సంవత్సరం ఎంత బాగా ముగిసింది. కమల్ హాసన్ ని ఇంటర్వూ చేసాను. సినిమాలనే ప్రాణంగా బ్రతికే ఆయన్ని ఇంటర్వూ చేయటం నా అదృష్టం.. ఆయన్ని ఇంటర్వూు చేయటం కాదు. కేవలం కూర్చుని ఆయన చెప్పేవి విన్నాను:)," అంటూ ట్వీట్ చేసారు.
ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ ''కనీసం ఊహించడానికి కూడా సాహసం చేయలేని ఎన్నో ప్రయోగాలు కమల్‌హాసన్ చేశారు. ఆయన ఆలోచనలు ఎంత గొప్పవో విశ్వరూపం ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. పైరసీని ఎలా అరికట్టాలో తెలియక ఎన్నో సంవత్సరాల నుంచి చిత్ర పరిశ్రమ ఇబ్బందులుపడుతోంది. 'విశ్వరూపం' తరహాలో సినిమాల్ని డీటీహెచ్‌లో విడుదల చెయ్యడం ఒక మంచి పరిష్కారంగా కనబడుతోంది''అన్నారు.
కమల్ హాసన్ తాజా చిత్రం 'విశ్వరూపం' ఆడియో సిని ప్రముఖుల సమక్షంలో ఆదివారం విడుదలైంది. కమల్ హాసన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం 'విశ్వరూపం'. పూజ, ఆండ్రియా హీరోయిన్స్. శంకర్-ఎహసాన్-లాయ్ స్వరాలు సమకూర్చారు. సినిమాని డీటీహెచ్‌లో విడుదల చేస్తూ కొత్త యుగంలోకి అడుగు పెడుతున్నాము''అన్నారు కమల్ హాసన్. ఈ చిత్రం డైరక్ట్ డిటిహెచ్ తో విడుదల అవుతోంది.


Click it and Unblock the Notifications












