ఆల్రెడీ దుమ్మురేపుతోంది, రాజమౌళి సపోర్ట్.... మరో బాక్సాఫీస్ తుఫాన్ మొదలవ్వబోతోందా?
Recommended Video

రాజమౌళి సినిమా విడుదలైతే బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల తుఫాన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమాలు కాక పోయినా ఇతర సినిమాలేమైనా విడుదలైనపుడు బావుందని ఆయన చిన్న ట్వీట్ చేస్తే చాలు కలెక్షన్లు అమాంతం పెరిగిపోతాయి. రాజమౌళి జడ్జిమెంట్ మీద సినీ అభిమానులకు అంత నమ్మకం మరి.
ప్రేక్షకులను ఓ రేంజిలో ఇన్‌ఫ్లూయెన్స్ చేయగల రాజమౌళి ఏదైనా సినిమాను సపోర్ట్ చేస్తూ ప్రీ రిలీజ్ ఈవెంటుకు హాజరైతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పటికే ఇంటర్నెట్లో వైరల్ అయిన 'కెజిఎఫ్' సినిమాను రాజమౌళి ప్రమోట్ చేయబోతున్నారు.
రాజమౌళి ముఖ్య అతిథిగా
హైదరాబాద్‌లో జరిగే కెజిఎఫ్ ప్రీ రిలీజ్ ఈవెంటుకు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు చిత్ర నిర్మాత విజయ్ కిరంగదూర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. హైదరాబాద్‌లోని జేఆర్‌సి కన్వెన్షన్ సెంటర్లో డిసెంబర్ 9న ఈ వేడుక జరుగనుంది.

సినిమాపై ఆసక్తి మరింత పెంచిన ‘కెజిఎఫ్' ట్రైలర్
కన్నడ హీరో యష్ హీరోగా రూపొందిన ‘కెజిఎఫ్' చిత్రాన్ని కన్నడతో పాటు తెలుగు, హిందీలో భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచేసింది.
ఆల్రెడీ దుమ్ము రేపుతోంది
నువ్వు ఎలా బ్రతుకుతావో నాకు తెలియదు. కానీ చచ్చిపోయేపుడు మాత్రం ఒక రాజులాగా, పెద్ద శ్రీమంతుడిగా చచ్చిపోవాలి అంటూ.... చనిపోయే ముందు ఒక తల్లి తన కుమారుడికి చెప్పే డైలాగ్స్‌తో విడుదలైన సెకండ్ ట్రైలర్ యూట్యూబ్‌లో దుమ్ము రేపుతోంది.

రెండు భాగాలుగా
‘కెజిఎఫ్' మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. కెజిఎఫ్ చాప్టర్ 1 పేరుతో మొదటి భాగం ఇపుడు విడుదల చేస్తున్నారు. ప్రశాంత్ నూలి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 70ల నాటి కథతో ఈ స్టోరీ సాగుతుంది. కెజిఎఫ్ అంటే ‘కోలార్ గోల్డ్ పీల్డ్స్'. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బంగారానికి ఏర్పడిన డిమాండ్... కోలార్ గోల్డ్ పీల్డ్స్ నేపథ్యంలో కథ సాగుతుంది.

వారాహి చలన చిత్రం...
తెలుగులో ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం బేనర్లో సాయి కొర్రపాటి విడుదల చేస్తోంది. ఈ చిత్రంలో యష్‌కు జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. డిసెంబర్ 21న ఈ యాక్షన్ ఎంటర్టెనర్ గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











