చాలా డిజప్పాయింట్ అయ్యా:రాజమౌళి
రముఖ దర్శకుడు రాజమౌళి రీసెంట్ గా ట్విట్టర్ లో తాను చాలా డిజప్పాయింట్ అయ్యానంటూ ట్వీట్ చేసారు. దానికి కారణం రాస్తూ...బరిష్టా రోడ్ నెంబర్ 36 నన్ను చాలా డిజప్పాయింట్ చేసింది. అక్కడ సర్వీస్ డెడ్ స్లో. మేము ఆర్డర్ ఇచ్చిన ముప్పై నిముషాల తర్వాత ఆ ఐటం అమ్ముడైపోయిందని లేదని చెప్పారు. దీనికి క్వయిట్ కాంట్రాస్ట్ గా రోడ్ నెంబర్ వన్ లో బరిస్టాలో సర్వీస్ ఉంటుంది.అక్కడ చాలా క్విక్ సర్వీస్ ..ప్రెండ్లీ స్టాప్ ఉంటారని ట్వీట్ చేసారు. ఇక రాజమౌళి తాజా చిత్రం 'ఈగ'విషయానికి వస్తే రిలీజ్,ఆడియో విడుదల డేట్స్ ఫిక్స్ చేసారు. మార్చి 22న ఈగ తెలుగు వెర్షన్ ఆడియోను, మార్చి 25న తమిళ వెర్షన్ ఆడియోను విడుదల చేస్తారు. అలాగే ఏప్రియల్ 25న చిత్రాన్ని విడుదల చేయటానికి డేట్స్ ఫిక్స్ చేసినట్లు నిర్మాతలు చెప్తున్నారు. నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రధారులుగా ఈ చిత్రాన్ని వారాహి చలనచిత్ర పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు మాట్లాడుతూ ''బలవంతుడైన మనిషికీ, అల్పప్రాణి ఈగకూ మధ్య జరిగిన పోరాటం ఇది. నాని, సమంత, సుదీప్ ముగ్గురూ ఈ కథని బాగా అర్థం చేసుకొన్నారు. విజువల్ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యం ఉన్న సినిమా ఇది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తాం. 24న తమిళ పాటలు ఆవిష్కరిస్తామని అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సెంథిల్ కుమార్, సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి, కళ: రవీందర్, సమర్పణ: డి.సురేష్ బాబు.


Click it and Unblock the Notifications











