నా పని కేవలం ఎన్టీఆర్ ని డైరక్ట్ చేసి అప్పచెప్పటం వరకే..
రాజమౌళి దర్శకత్వంలో జూ ఎన్టీఆర్ త్వరలో నవరత్న టాల్కం పౌడర్ యాడ్ ఫిలింలో నటించనున్న సంగతి తెలిసిందే. ఆ యాడ్ ఫిలిం గురించి రాజమౌళి ట్విట్టర్ లో రాస్తూ...కాన్సెప్ట్, ప్రొడక్షన్ ప్లాన్ అంతా యాడ్ ఏజన్సీ వాళ్ళు చూసుకుంటారు. వాటి గురించి నాకు ఇంకేమీ తెలియదు. నా పని కేవలం యాడ్ ని డైరక్ట్ చేసి ఇచ్చేయటమే అన్నారు. నవరత్న వారు నేషనల్ లెవల్లో యాడ్ ఫిలింని తయారు చేసుకుని ఏ రాష్ట్రానికి అక్కడ స్టార్స్ తో చేయిస్తూ మార్కెట్ ని విస్త్రృతం చేసుకునే ప్రాసెస్ లో ఇక్కడ రాజమౌళికి అప్పచెప్పారు.
ఈ యాడ్ ఫిలిమ్ కి అంతటా ఒకటే కాన్సెప్టు ఉంటుంది. దర్శకుడుగా రాజమౌళికి మంచి రెమ్యునేషన్ మాత్రం ఇస్తున్నారని, ఎన్టీఆర్ ని బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నుకున్నప్పుడే రాజమౌళిని ప్రపోజ్ చేసాడని తెలుస్తోంది. అలాగే ఎన్టీఆర్ కు ఇది రెండో యాడ్ ఫిలిం. మొదటిది జండూభామ్. ఇక రాజమౌళికి ఇది మొదటి కమర్షియల్ యాడ్ ఫిలిం. డైరక్టర్ కాకముందు ఆర్కే బ్యానర్ లో ఎలక్ట్రానిక్ మీడియాకు యాడ్స్ చేసారు. యాడ్ ని అందివ్వబోతున్నారో అని అభిమానులు ఎదురుచూడటం మాత్రం ఖాయం.


Click it and Unblock the Notifications











