twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    SS Rajamouli ని ఆఖరికి లవంగాన్ని చేసేశారు.. RRR హీరోలకు చలాన్స్ వేస్తే..

    |

    టాలీవుడ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతోమంది సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమాల్లో RRR టాప్ లిస్టులో ఉంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారి కలిసి నటిస్తున్న సినిమా కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మంగళవారం విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో సరదాగా కూడా మంచి ఫన్ క్రియేట్ చేస్తోంది.

    భారీ బడ్జెట్ తో..

    భారీ బడ్జెట్ తో..

    దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా కోసం దాదాపు 450కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. వీలైనంత వరకు సినిమా అన్ని భాషల్లో హిట్టయ్యేలా రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మంగళవారం విడుదలైన పోస్టర్ మరోసారి సినిమాపై అంచనాలస్ డోస్ పెంచేసింది.

    అభిమానులు మెచ్చిన పోస్టర్

    అభిమానులు మెచ్చిన పోస్టర్

    సినిమా షూటింగ్ అప్డేట్ పై వివరణ ఇస్తూ కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు రెగ్యులర్ ఫ్రెండ్స్ తరహాలో బైక్ వెళుతున్న ఆ లుక్ ఇరు వర్గాల అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. జూనియర్ ఎన్టీఆర్ బైక్ నడుపుతుండగా రామ్ చరణ్ వెనకాల తారక్ ను పట్టుకొని కూర్చోవడం నెటిజన్లను ఆకట్టుకుంది.

    స్పందించిన RRR

    స్పందించిన RRR

    ఇక పాత కాలం బైక్ అయినప్పటికీ కొన్ని సరదా కామెంట్స్ కూడా వస్తున్నాయి. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్, హీరోలకు హెల్మెంట్ కూడా పెట్టి.. ఇప్పుడు పర్ఫెక్ట్ అని ఒక ఫొటోను వదలడం వైరల్ అయ్యింది. ఇక ఆ ఫొటోపై స్పందించిన RRR టీమ్ ఇప్పుడు కూడా పర్ఫెప్ట్ కాదని, నెంబర్ ప్లేట్ కూడా మిస్సయ్యిందని అన్సార్ ఇచ్చింది.

    రాజమౌళిని లవంగాన్ని చేసి..

    రాజమౌళిని లవంగాన్ని చేసి..

    అంతే కాకుండా మీమ్స్ దెబ్బకు రాజమౌళిని కూడా లవంగాన్ని చేసేశారు. మన్మథుడు సినిమాలో బ్రహ్మానందం బిల్ సీన్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే దానికి తగ్గట్లుగానే జక్కన్న ఫేస్ ను మార్ఫింగ్ చేసి లవంగాన్ని చేసేశారు. హీరోల చలాన్ చూసి.. ప్రొడ్యూసర్ కట్టలేదా అని ఎడిట్ చేయడం సరదగా ఉంది. మొత్తానికి RRRకు సంబంధించిన చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీమర్స్ బుర్రలకు పనిచెబుతున్నారు.

    English summary
    Tollywood's Biggest Multistarrer Movie RRR Pan India is about to live up to expectations. Director Rajamouli, who was careful in his promotion, not only gave the entire movie update but also left a special poster and gave a good kick to the fans of both the categories. This time Pawan Kalyan's name also went viral in the promotion which is a special attraction.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X