'మగధీర' లా 'మర్యాదరామన్న' చిత్రంలో కూడా
రాజమౌళి, సునీల్ కాంబినేషన్లో రానున్న 'మర్యాద రామన్న' చిత్రంలో గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగానే ఉండబోతోందని సమాచారం. మరీ మగధీర రేంజిలో గ్రాఫిక్స్ లేకపోయినా 'మర్యాద రామన్న' కి గ్రాఫిక్స్ బడ్జెట్ ఎక్కువే ఖర్చుపెడుతున్నారని అంతటా వినపడుతోంది. కామిడీ సినిమాకి గ్రాఫిక్స్ ఏమిటనుకున్నా రాజమౌళి తాను అనుకున్నది తెరకెక్కించటానికి మాత్రం వెనకాడటం లేదని, ఈ చిత్రం కూడా విజువల్ ట్రీట్ లా ఉండాలి అని భావించి చేస్తున్నాడని చెప్తున్నారు. మరో ప్రక్క రాజమౌళి రెగ్యులర్ తన చేసే సినిమాలకు భిన్నమైనదని, స్లాప్ స్టిక్ కామిడీ ఉండదని, తన వరకూ ఓ ప్రయోగం అని అంటున్నారు. సలోని హీరోయిన్ గా చేసే ఈ చిత్రం ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో కామిడీగా జరుగుతుంది.
ఈ చిత్రం కథలో ఎక్కువ భాగం ఓ ఇంటిలో జరుగుతుందని, మర్యాదలకు ఎక్కువ విలవనిచ్చే రాయలసీమ నేఫద్యంలో ఈ చిత్రం జరగనుంది. కథ ప్రకారం అమెరికాలో ఉండి వచ్చిన సునీల్ తన ఊళ్లో ప్యాక్షన్ హత్యలు లేకుండా చేయాలని ప్రత్యర్ధి ఇంటికెళ్ళి ఇరుక్కుంటాడు. అక్కడ మర్యాదలు ప్రకారం ఇంటికొచ్చిన అతిధిని ఏమీ చేయకూడదు. అలా ఇంటిలోకి వచ్చి పడిన వాడిని బయిటకు గెంటాలని ఆ ప్రత్యర్ధుల ఫ్యామిలీ ప్లాన్ చేస్తూంటుంది. గుమ్మం దాటితే తల తెగుతుందని సునీల్ అక్కడే ఉండి వారిలో ఎలా మార్పు తెస్తాడన్నది కథ అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అలాగే మగధీర చిత్రం తర్వాత రాజమౌళి డైరక్ట్ చేస్తున్న చిత్రం కావటంతో మంచి అంచనాలే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











