For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RRRపై కరోనా దెబ్బ.. ఎప్పుడు రిలీజ్ చేస్తామో క్లారిటీ లేదు.. రాజమౌళి

  |

  దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR మూవీకి కాలం కలిసివచ్చినట్టు కనిపించడం లేదు. ఈ సినిమా ఏ ముహుర్తాన మొదలైందో.. అనేక అవాంతరాలు, విఘ్నాలు వెంటాడుతున్నాయి. తాజాగా కరోనావైరస్ రూపంలో మరోసారి ఈ సినిమా షూటింగ్‌పై దెబ్బ పడింది. దీంతో వచ్చే సంక్రాంతికైనా ఈ సినిమా రిలీజ్ అవుతుందా అనే ప్రశ్నలు మీడియాలో లేవనెత్తుతున్నాయి. తాజా పరిస్థితులే అందుకు కారణంగా పలువురు పేర్కొంటున్నారు. కాగా, ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. ఈ విషయంపై రాజమౌళి చెబుతూ..

   కరోనా భయాందోళనలు

  కరోనా భయాందోళనలు

  దేశంలో కరోనావైరస్ భయాందోళనలు పెరిగిపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రమైన నిర్ణయాలతో ముందుకెళ్తున్నాయి. దేశవ్యాప్తంగా మరో 21 రోజులు లాక్‌డౌన్ ప్రకటిస్తూ ప్రధాని మోదీ సంచలన నిర్ణయం తీసుకొన్నారు. దాంతో సుమారు మరో నెల రోజులపాటు అన్ని రంగాల్లో స్తబ్దత నెలకొనే పరిస్థితి కనిపిస్తున్నది. ఈ ప్రభావం RRRపై కూడా ఉండే అవకాశాలున్నాయి.

  RRRపై ప్రభావం

  RRRపై ప్రభావం

  ప్రధాని నిర్ణయంతో సినీ పరిశ్రమపై భారీ ప్రభావం చూపబోతున్నది. బాలీవుడ్, దక్షిణాది చిత్రాల రిలీజ్‌కు అడ్డంకి కావడంతో పెద్ద మొత్తంలో నష్టాలు సంభవించే అవకాశాలు లేకపోలేదని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ ప్రభావం RRR సినిమాపై కూడా పడటం ఖాయమనే విషయం స్పష్టంగా కనిపిస్తున్నది.

  రిలీజ్ పరంగా

  రిలీజ్ పరంగా

  ఇప్పటికే నటీనటుల గాయాలు, ఆలియాభట్ డేట్ల సమస్య ఒక కొలిక్కి వచ్చిందనుకొంటున్న సమయంలో కరోనావైరస్ మరోసారి దెబ్బ తీసింది. శరవేగంతో షూటింగ్ పూర్తి చేయాలనుకొనే ప్లాన్లపై కరోనావైరస్ నీళ్లు చల్లింది. దీంతో రిలీజ్ పరంగా, బడ్జెట్ పరంగా భారీగా ప్రభావం పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

  రామ రౌద్ర రుషితం టైటిల్‌తో

  రామ రౌద్ర రుషితం టైటిల్‌తో

  ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య RRR మూవీని సుమారు రూ.450 కోట్లతో తెరక్కిస్తున్నారు. భారీ స్థాయిలో వీఎఫ్‌ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్‌కు ప్లాన్ చేశారు. ఈ చిత్రాన్ని జనవరి 8వ తేదీన రిలీజ్ చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ చిత్రానికి రామ రౌద్ర రుషితం అనే టైటిల్‌ను పరిశీలనలో ఉంది.

  ఉగాది కానుకగా

  ఉగాది కానుకగా

  ఉగాది పండుగ సందర్భంగా RRR మూవీ యూనిట్ సినిమా మోషన్ పోస్టర్‌ను, టైటిల్‌ను ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. పండుగ రోజున పలు యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా విడుదల చేయాలని నిర్ణయించింది. బుధవారం ఏదో ఒక సమయంలో ఈ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

  RRR Motion Poster : Megastar Chiranjeevi, RGV Reacts On RRR Title & RRR Motion Poster

  మోషన్ పోస్టర్ ఎప్పుడో చెప్పలేం

  మోషన్ పోస్టర్‌ రిలీజ్ సందర్భంగా దర్శకుడు రాజమౌళి ట్విట్టర్‌లో స్పందించారు. ప్రపంచం సంక్షోభం దిశగా ప్రయాణిస్తున్నసమయంలో.. అందరిలో సానుకూలత స్ఫూర్తిని పెంచడానికి మేము ప్రయత్నిస్తున్నాం. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న మోషన్ పోస్టర్ ఆవిష్కరణను ఉగాది సందర్భంగా చేపట్టాం. మోషన్ పోస్టర్ ఎప్పుడు, ఏ సమయానికి రిలీజ్ చేస్తామనే విషయంపై క్లారిటీ లేదు. మా సిబ్బంది, నిపుణులు అంతా ఇంటి నుంచి పనిచేస్తున్నారు. కాబట్టి ఈ విషయంపై క్లారిటీ లేదు అని రాజమౌళి ట్వీట్ చేశారు.

  English summary
  RRR movie motion poster on Ugadi festival. SS Rajamouli tweeted that It's a time of global crisis. We wanted to do our bit in lifting up everyone's spirits. We are launching the long overdue Title Logo with Motion Poster of RRRMovie, Tomorrow. Though I can’t promise any specific time now, as everyone of our team are working from home.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X