»   » సునామీ సృష్టిస్తున్న బాహుబలి2 ట్రైలర్.. చరిత్రలో నిలిచిపోయే రోజు..

సునామీ సృష్టిస్తున్న బాహుబలి2 ట్రైలర్.. చరిత్రలో నిలిచిపోయే రోజు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి2 ట్రైలర్‌కు సోషల్ మీడియాలో అనూహ్య స్పందన లభిస్తున్నది. యూట్యూబ్‌లో భారతీయ సినిమా చరిత్రనే తిరగరాస్తున్నది. ఈ సినిమా ట్రైలర్‌ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో గురువారం విడుదలైంది. అన్ని భాషల్లో కలిపి యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌లో ఈ ట్రైలర్లను 5 కోట్ల మందికి పైగా వీక్షించారు. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు రాజమౌళి ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.

ప్రపంచవ్యాప్తంగా బాహుబలి

‘5 కోట్లు వ్యూస్‌తో 24 గంటల్లో ఎక్కువమంది చూసిన తొలి భారతీయ సినిమా ట్రైలర్‌గా ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌' నిలిచింది అని రాజమౌళి ట్వీట్‌ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 24 గంటల్లో ఎక్కువమంది చూసిన ట్రైలర్లు, వీడియోల జాబితాలో ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌' 13వ స్థానంలో నిలిచిందని రాజమౌళి ట్వీట్‌లో పేర్కొన్నారు.


ఏడో స్థానంలో

ఏడో స్థానంలో

విడుదలైన 24 గంటల్లో యూట్యూబ్‌లో అత్యధికంగా వీక్షించిన వీడియోల జాబితాలో ‘బాహుబలి 2' ట్రైలర్‌ 7వస్థానంలో నిలిచినట్టు ‘బాహుబలి' ప్రభాస్ తన ఫేస్‌బుక్ పేజీలో రాశారు. ఈ ట్రైలర్ నిడివి దాదాపు 2 నిమిషాల 20 సెకన్లు.


200 కోట్ల బడ్జెట్..ఇప్పటికే రూ.500 కోట్లు

200 కోట్ల బడ్జెట్..ఇప్పటికే రూ.500 కోట్లు

బాహుబలి2 చిత్రాన్ని సుమారు రూ.200 కోట్లతో తెరకెక్కించారు. విడుదలకు ముందే ఈ చిత్రం శాటిలైట్ హక్కులు, డిస్ట్రిబ్యూషన్ కింద రూ.500 కోట్లు ఆర్జించింది.


ఇదో రికార్డు. భళ్లాల దేవ

ఇదో రికార్డు. భళ్లాల దేవ

ఈ ట్రైలర్ అత్యధిక వ్యూస్ సాధించడంపై చిత్రంలో భళ్లాలదేవ పాత్రలో నటించిన రానా దగ్గుబాటి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇది రికార్డు. థ్యాంక్స్ అంటూ ట్వీట్ చేశారు.


తలవంచి నమస్కరిస్తున్నా.. క్రిష్

బాహుబలి2 చిత్ర ట్రైలర్ దూసుకెళ్తున్నది. అందులో నటించిన తారలందరూ సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఈ చిత్రం ఇప్పుడెప్పుడు చూడాలనే కోరికతో ఉన్నాను. అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించిన రాజమౌళికి తలవంచి నమస్కరిస్తున్నా అని దర్శకుడు క్రిష్ ట్వీట్ చేశారు.


సింప్లీ.. సూపర్

సింప్లీ సూపర్. ట్రైలర్ అద్భుతంగా ఉన్నది. రాజమౌళి ఎప్పడు నిరాశపరచరు. సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాను అని మంచు మనోజ్ ట్వీట్ చేశారు.


చరిత్ర సృష్టించింది..

ట్రైలర్ చరిత్ర సృష్టించింది. 50 మిలియన్ల వ్యూస్. అభిమానుల జోరు కొనసాగుతున్నది. ప్రపంచవ్యాప్తంగా బాహుబలి2 ట్రైలర్ ట్రెండ్ అవుతున్నది. ఏప్రిల్ 28వ తేదీ చరిత్రలో మిగిలిపోవడం ఖాయం అని కరణ్ జోహర్ ట్వీట్ చేశారు.


English summary
All the versions of Baahubali 2 trailer have amassed a combined 50 million views on YouTube and Facebook in 24 hours of its release.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu