Akhanda బాలకృష్ణ ఆటం బాంబ్.. దానిని కరెక్ట్‌గా పేల్చడం బోయపాటికే తెలుసు.. ఎస్ఎస్ రాజమౌళి పవర్‌ఫుల్ స్పీచ్
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న అఖండ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అద్భుతంగా కొనసాగింది. ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా ఎస్ఎస్ రాజమౌళి, అల్లు అర్జున్ పాల్గొన్నారు. ఈ వేడుకలో RRRని సినీ ప్రపంచానికి అందించబోతున్న ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ..

ఎస్ఎస్ రాజమౌళి చేతుల మీదుగా
అఖండ ప్రీ రిలీజ్‌కు హాజరైన దర్శక ధీరుడు రాజమౌళి ఈ సినిమా పాటను ఆవిష్కరించారు. బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ నటించిన ఆ పాట అభిమానులను ఆకట్టుకొనే విధంగా ఉంది. ఆ పాటలో బాలకృష్ణ వేసిన స్టెప్పులు మంచి ఎనర్జీతో కనిపించాయి. అభిమానులతోపాటు రాజమౌళి కూడా బాలయ్య స్టెప్పులను ఆస్వాదించారు.

బోయపాటికి థ్యాంక్స్
అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు నన్ను పిలువడమే కాకుండా ఈ ఆడిటోరియానికి, సినిమా పరిశ్రమకు ఓ ఊపు తెప్పించిన బోయపాటి శ్రీనుకు థ్యాంక్స్. డిసెంబర్ 2వ తేది నుంచి తెలుగు రాష్ట్రాల్లనే కాకుండా ఈ సినిమా విడుదలైన ప్రతీ చోట ఓ ఊపు ఉంటుందని బలంగా నమ్ముతున్నాను. అలాంటి ఊపు తెప్పించబోతున్న బోయపాటికి మరోసారి థ్యాంక్స్ అని ఎస్ఎస్ రాజమౌళి అన్నారు.

బాలకృష్ణ అనే ఆటంబాంబ్‌ను పేల్చడం
బాలకృష్ణ ఒక ఆటంబాంబ్. ఆ ఆటం బాంబ్‌ను ప్రయోగించడం బోయపాటి ఒక్కడికే తెలుసు. ఆ ఆటంబాంబును కరెక్ట్‌గా పేల్చడం బోయపాటి ఒక్కరికే తెలుసు. ఆ సీక్రెట్ మాకు కూడా చెబితే బాగుంటుందని నా ఫీలింగ్. ఆ సీక్రెట్‌ను అందరితో పంచుకొంటే హ్యాపీగా ఉంటుందని అనుకొంటున్నాను అని బాలకృష్ణ అన్నారు.

బాలయ్య.. ఎనర్జీ ఏమిటి సార్?
బాలకృష్ణను ఉద్దేశించి ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ.. సార్.. బాలయ్య గారు.. మీ ఎనర్జీ సీక్రెట్ కూడా చెప్పాలి. ఆ డ్యాన్సులు ఏంటి సార్.. ఆ ఎనర్జీ ఏంటి సార్. మనం చూసింది మచ్చుతునక మాత్రమే. సినిమాలో అఖండ ఎంట్రీ కోసం నేను ఎదురు చూస్తున్నా. ఫస్ట్ డే ఫస్ట్ షో థియేటర్లలో చూస్తున్నా. అఖండ అద్భుతమైన విజయం సాధించాలి. ఇండస్ట్రీకి ఒక ఊపు తీసుకురావాలి అని ఎస్ఎస్ రాజమౌళి అన్నారు.
Recommended Video

ఈలల, గోలతో అభిమానుల ఉత్సాహం
అఖండ లాంటి గొప్ప సినిమాను అందించబోతున్న నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డిని రాజమౌళిని అభినందించారు. మంచి విజయాన్ని అందుకోవాలని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. రాజమౌళి మాట్లాడుతున్నంత సేపు అభిమానులు ఆనందంతో ఉత్సాహం ఈలలు, గోల చేస్తూ కనిపించారు.


Click it and Unblock the Notifications











