»   » పద్మావతి.. నీపై చూపు తిప్పుకోలేకపోతున్నాను... రాజమౌళి సెన్సేషనల్ ట్వీట్

పద్మావతి.. నీపై చూపు తిప్పుకోలేకపోతున్నాను... రాజమౌళి సెన్సేషనల్ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
"I Can't Take My Eyes Off Ranveer Singh" Tweeted Rajamouli సెన్సేషనల్ ట్వీట్..

బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన పద్మావతి చిత్ర ట్రైలర్‌ విశేషంగా ఆకట్టుకొంటున్నది. ట్రైలర్‌లోని సన్నివేశాలు గ్రాండ్‌గా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి. రిలీజ్ అయిన వెంటనే పద్మావతి ట్రైలర్ సోషల్ మీడియా, యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. అలాంటి ట్రైలర్‌పై బాహుబలి దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. రాజమౌళి ఏమన్నారంటే..

అద్భుతంగా పద్మావతి ట్రైలర్

పద్మావతి ట్రైలర్ అద్భుతంగా ఉంది. ప్రతీ ఫ్రేమ్‌లో పర్‌ఫెక్షన్ కనిపిస్తున్నది. సన్నివేశాలను అద్భుతంగా తీర్చిదిద్దారు సంజయ్ లీలా భన్సాలీ. సీన్ల చూస్తుంటే కళ్లు తిప్పుకోలేకపోతున్నాను అని రాజమౌళి ట్వీట్ చేశారు.

భయంకరంగా రణ్‌వీర్ లుక్

భయంకరంగా రణ్‌వీర్ లుక్

రణ్‌వీర్ లుక్ చాలా భయంకరంగా ఉంది. క్రూరంగా ఉన్న ఆయన రూపాన్ని చూడటానికి కళ్లు సరిపోవడం లేదు. ఆయన నటనపై దృష్టి తిప్పుకోలేకపోతున్నాను అని పద్మావతి ట్రైలర్, నటీనటులపై రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు.

 నచ్చిన సినిమాలపై

నచ్చిన సినిమాలపై

తనకు నచ్చిన చిత్రాలపై రాజమౌళి ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉంటారు. సోషల్ మీడియాను ఆసరాగా చేసుకొని వారిని అభినందిస్తుంటారు. టాలీవుడ్‌లో ఇటీవల విడుదలైన జై లవకుశ చిత్రానికి కూడా రాజమౌళి కితాబు ఇచ్చారు.

 జై అంటూ రాజమౌళి

జై అంటూ రాజమౌళి

తారక్.. నీ నటన చూసి నా హృదయం ఉప్పొంగుతున్నది. గర్వంతో పొంగిపోతున్నాను. మాటల రావడం లేదు. జై అంటూ రాజమౌళి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

 భన్సాలీకి బిగ్‌బీ కితాబు

భన్సాలీకి బిగ్‌బీ కితాబు

ఇదిలా ఉండగా పద్మావతి ట్రైలర్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లివిరిస్తున్నాయి. ఈ ట్రైలర్‌పై ఇంత అద్భుతంగా ఎలా రూపొందిస్తారు. నీ అద్భుతమైన విజన్‌కు నిదర్శనమే పద్మావతి ట్రైలర్ అంటూ బిగ్ బీ ప్రశంసించారు.

English summary
The trailer of Deepika Padukone, Ranveer Singh and Shahid Kapoor's upcoming period piece Padmavatiis what Twitter has been busy with since it arrived yesterday afternoon. 'Padmavati trailer' has been trending for over 18 hours now and Baahubali director S S Rajamouli also has a role to play in it. Ranveer Singh looks menacing and frightening yet can't take my eyes off him," tweeted Rajamouli. Same here, actually.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu