twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇది షాకింగ్‌ పరిణామం.. ఈ పరిస్థితుల్లో అలాంటి అవ‌స‌రం ఎంతైనా ఉంది: రాజమౌళి

    |

    ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోంది కరోనా వైరస్. చైనా దేశంలో పుట్టిన ఈ మహమ్మారి వైరస్ ఇప్పటికే ప్రపంచంలోని 145 కు పైగా దేశాల్లో పాగా వేసి వేలాదిమందికి బలిగొంది. దీంతో జనం భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇష్యూపై దర్శధీరుడు రాజమౌళి స్పందిస్తూ కొన్ని సూచనలు చేశారు. వివరాల్లోకి పోతే..

    భయపెడుతున్న కరోనా.. ప్రభుత్వాల చర్యలు

    భయపెడుతున్న కరోనా.. ప్రభుత్వాల చర్యలు

    రోజు రోజుకూ కరోనా కేసులు ఎక్కువవుతుండటంతో అన్ని దేశాల ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. సహాయక చర్యలు తీసుకుంటూ కరోనా సోకకుండా తెసుకోవాల్సిన జాగ్రత్తలపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. జనం ఎక్కువగా ఉండే ప్రదేశాలపై దృష్టి సారించి ఆంక్షలు విధిస్తున్నాయి.

    తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం.. అన్నీ బంద్

    తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం.. అన్నీ బంద్

    ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా కీలక ప్రకటన జారీ చేసింది ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కూల్స్, కాలేజెస్, షాపింగ్ మాల్స్, థియేటర్స్ అన్నీ మూసేయాలని ఆదేశించింది. దీంతో ఎక్కడచూసినా కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. జనం రోడ్ల మీదకు రావడంలేదు.

    టాలీవుడ్ నిర్ణయం.. షూటింగ్స్ క్లోజ్

    టాలీవుడ్ నిర్ణయం.. షూటింగ్స్ క్లోజ్

    కరోనా వైరస్ వ్యాప్తిచెందకుండా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని టాలీవుడ్ చిత్రసీమ స్వాగతించింది. సోమవారం నుంచి సినిమా షూటింగ్స్ నిలిపివేస్తున్నామని ఫిల్మ్ చాంబర్ వెల్లడించింది. మార్చి 31 వరకు అన్ని సినిమాల షూటింగ్స్ నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు.

    షాకింగ్‌.. ఇలాంటి ప‌రిస్థితుల్లో! రాజమౌళి ట్వీట్

    షాకింగ్‌.. ఇలాంటి ప‌రిస్థితుల్లో! రాజమౌళి ట్వీట్

    ఈ నేపథ్యంలో దర్శక ధీరుడు రాజ‌మౌళి కరోనా వైరస్‌పై, తాజా పరిణామాలపై స్పందించారు. ''క‌రోనా కార‌ణంగా ప్రపంచం నిలిచిపోవ‌డం చూస్తుంటే షాకింగ్‌గా ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో భ‌యాందోళ‌న‌లు వ్యాప్తి చెంద‌కుండా చూడాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. కోవిడ్ 19 వ్యాప్తిని నివారించ‌డానికి తగిన చర్యలను పాటించండి. కరోనాపై అప్రమ‌త్తంగా ఉంటే మంచిది'' అని రాజమౌళి ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.

    Recommended Video

    Coronavirus in Hyderabad : Actor Benerjee About Coronavirus Precautions

    RRR బిజీ.. రాజమౌళి

    రాజమౌళి ప్రస్తుతం RRR సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 80 శాతం మేర ఫినిష్ చేశారు. చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

    English summary
    In Telangana state all theaters and public places could remain closed through the end of March as the government works to contain the virus, Deadline reported. Now Rajamouli reacted on this issue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X