twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్లేమాక్స్ లో ఏడ్చేసాను: రాజమౌళి

    By Srikanya
    |

    ట్విట్టర్ లో ఎప్పుడూ చురుగ్గా ఉండే తెలుగు డైరక్టర్ రాజమౌళి.ఆయన తాజాగా ఓ యానిమేటెడ్ చిత్రం చాలా బాగుందంటూ, తప్పనిసరిగా చూడమని ట్విట్ చేసారు.ఆయన మాటల్లోనే...ఓ అధ్బుతమైన యానిమేటెడ్ సినిమా చూసాను. దానిపేరు ది ఐరన్ జెయింట్. నేను క్లైమాక్స్ లో ఏడ్చేసాను. అస్సలు మిస్ కావద్దు.స్టోరీ టెల్లింగ్ అద్బుతంగా ఉంది అన్నారు. ప్రస్తుతం రాజమౌళి ఈగ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. సమంత, నాని, కన్నడ స్టార్ సుదీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కీలక పాత్రను పోషించనుంది. సురేష్ ప్రోడక్షన్ సమర్పణలో ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాకి యం యం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

    'ఈగ" సబ్జెక్ట్ సెంట్రల్ పాయింట్ ఏమిటంటే 'తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే 'ఈగ" రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో 'ఈగ"గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై.. అదీ ఓ పరమ క్రూరుడిపై ఆ 'ఈగ" ఎలా గెలిచిందీ.. ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ" అన్నదే క్లుప్తంగా 'ఈగ" కథాంశం.

    English summary
    SS Rajamouli recommends a film to watch... and tweets as...Saw a wonderful animated film called "the iron giant". I cried in the climax. Don't miss it.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X