twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్రహ్మస్త్రాన్ని వదిలిన రాజమౌళి.. బాహుబలికి కృతజ్ఞతగా..

    |

    బాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మాత కరణ్ జోహర్ రూపొందిస్తున్న చిత్రం బ్రహ్మస్త్ర. రణ్‌బీర్ కపూర్, అలియాభట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఆయన్ ముఖర్జి దర్శకుడు. ఈ చిత్రానికి హీరు జోహర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా, రణ్‌బీర్ కపూర్, ఆయన్ ముఖర్జీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న ఈ చిత్రం తెలుగులోకి డబ్ అవుతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు లోగోను ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి విడుదల చేశాడు. వివరాల్లోకి వెళితే..

     ఉనికి గర్వం

    ఉనికి గర్వం

    బ్రహ్మస్తం మోషన్ టైటిల్‌ లోగో ఆదిలోనే ఆసక్తిని రేపింది. అందులో డైలాగ్స్‌ ఆకట్టుకొనేలా ఉన్నాయి. ‘మన ఉనికి గర్వం. చరిత్రకు అది శిఖరం. బ్రహ్మండంలో ఉన్న శక్తి అంతటికి స్థావరం. అదే బ్రహ్మస్త్రం' అంటూ వచ్చే డైలాగ్స్‌ మోషన్ టైటిల్‌లో వినిపించాయి. ఈ లోగోను రాజమౌళి రిలీజ్ చేసి ట్వీట్ చేశారు.

    హ్యాపీగా ఉందని రాజమౌళి ట్వీట్

    దేశంలోనే తొలి మైథికల్ ఫ్యుజన్ డ్రామా ట్రయాలజీ ‘బ్రహ్మస్త' సినిమా మోషన్ లోగోను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. అద్భుతమైన నటీనటులు, సాంకేతిక నిపుణులతో సినిమా రూపొందుతున్నది. దర్శకుడు ఆయన్, నిర్మాత కరణ్‌కు విజయం చేకూరాలి అని రాజమౌళి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

    రూ.150 కోట్ల బడ్జెట్‌తో

    రూ.150 కోట్ల బడ్జెట్‌తో

    యే జవానీ హై దీవాని చిత్ర దర్శకుడు ఆయన్ ముఖర్జీ రూపొందిస్తున్న ఈ చిత్రం బడ్జెట్ రూ.150 కోట్లు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవల రిలీజై వైరల్‌గా మారింది. రణ్‌బీర్ కపూర్‌తో కూడిన ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

     రాజమౌళి క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని

    రాజమౌళి క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని

    ఇటీవల కాలంలో కరణ్ జోహర్, రాజమౌళికి మధ్య సన్నిహిత సంబంధాలు మెరుగ్గా ఉన్నాయి. గతంలో బాహుబలి సినిమాలను హిందీలో ధర్మ ప్రొడక్షన్ బ్యానర్‌పై కరణ్ జోహర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల రాజమౌళి, ప్రభాస్, రానాను తన కాఫీ విత్ కరణ్ షోకు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. రాజమౌళికి ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని టైటిల్ లోగోను ఆయన చేత రిలీజ్ చేయించినట్టు తెలిసింది.

    English summary
    Bahubali director SS Rajamouli released Brahmastra Telugu Logo. He tweeted that Happy to launch the Telugu logo of the first Indian mythical fusion drama trilogy, #Brahmastra that’s being made on an epic scale with the magnificent star cast.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X